చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం
ABN , Publish Date - Apr 25 , 2026 | 06:45 AM
ఆర్టీసీ ఉద్యోగులు ప్రాణాలను తీసుకోవద్దని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.
ఆర్టీసీ ఉద్యోగులు ప్రాణాలు తీసుకోవద్దు: భట్టి
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగులు ప్రాణాలను తీసుకోవద్దని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో జరిగిన చర్చల సందర్భంగా భట్టి మాట్లాడారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మరణించడం చాలా బాధాకరమని, వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే.. ప్రాణమనేది అత్యంత విలువైనదని, ప్రాణాలు తీసుకోవద్దని అన్నారు. ఆర్టీసీ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అని, దీనిని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాటు ఆర్టీసీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నదని, పాలనాపరంగా సంస్థ చిన్నాభిన్నమైందని ఆయన చెప్పారు.