Share News

దోచుకున్న బీఆర్‌ఎస్‌‌కు ఎందుకు ఓటేయాలి?!

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:21 AM

ప్రతిపక్ష బీఆర్‌ఎ్‌సపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నల వర్షం కురిపించారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నందుకు వారికి ఓటేయాలా..

దోచుకున్న బీఆర్‌ఎస్‌‌కు ఎందుకు ఓటేయాలి?!

  • వైరా సభలో నిలదీసిన డిప్యూటీ సీఎం భట్టి

వైరా, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష బీఆర్‌ఎ్‌సపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నల వర్షం కురిపించారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నందుకు వారికి ఓటేయాలా.. ప్రజలందరినీ తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచినందుకు ఓటేయాలా? అని ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో ఒక్కరికి ఇల్లు గానీ, ఇళ్ల స్థలం గానీ ఇవ్వలేదని బీఆర్‌ఎ్‌సపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీఆర్‌ఎస్‌ పాలన చాలునని, వారి పరిపాలన ముగిసిపోయిందన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం నిర్వహించిన భారీ ర్యాలీ అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతీ పైసా పోగుచేసి, పేదలకు పంచుతామని అన్నారు. పేదల ఆత్మగౌరవం కోసం ఎన్ని నిధులైనా ఖర్చుచేస్తామని, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Feb 09 , 2026 | 02:21 AM