Share News

రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులు

ABN , Publish Date - May 05 , 2026 | 12:54 AM

రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయని, కరీంనగర్‌లో ఉదయం 11 గంటలకే ఐదుగురు తుపాకులతో కాల్పులు జరిపి ఒక బంగారం దుకాణంలో దోపిడి చేసి పారిపోయారంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఆలోచించాలని

రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులు

సిరిసిల్ల, మే 4 (ఆంరఽధజ్యోతి): రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయని, కరీంనగర్‌లో ఉదయం 11 గంటలకే ఐదుగురు తుపాకులతో కాల్పులు జరిపి ఒక బంగారం దుకాణంలో దోపిడి చేసి పారిపోయారంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఆలోచించాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షుడు కే తారక రామారావు అన్నారు. ఎవరి పనులు వారు చేయడం లేదని హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి, జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకటే పని పెట్టుకున్నారని దాచుకో.. దోచుకో అన్నట్లు దండుపాళ్యం ముఠాగా పడ్డారని కేటీఆర్‌ విమర్శించారు. సోమవారం సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్‌లో కౌన్సిలర్‌ బోల్గం వైష్ణవి, మాజీ కౌన్సిలర్‌ నాగరాజు దంపతులతో పాటు పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు అరగోస పడుతున్నారని అన్నారు. వరి ధాన్యం, జొన్న, మక్కలు కొనుగోలు చేయడం లేదని అన్నారు ధాన్యం కొనుగోలు లేక ఐకేపీ కేంద్రాల్లో రైతులు వడదెబ్బకు, పిడుగులు పడి రైతులు చనిపోతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో వెయ్యి మంది రైతులు చనిపోయారని అన్నారు. రేవంత్‌రెడ్డి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఏవని గట్టిగా అడిగితే లాగులో తొండలు విడుస్తా. నీ గుడ్లు పీకి గోలీలాడుతా. నీ పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటున్నాడని ఇంత తెలివి తక్కువ ముఖ్యమంత్రి మనకు ఉన్నాడని అన్నారు. సొంత రాష్ట్రాన్ని ఎవరైనా తిట్టుకుంటారా అని ప్రశ్నించారు. ఢిల్లీ పోతే దొంగ లెక్క చూస్తున్నారని చెప్పులు ఎత్తుకుపోతాడని అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదని రేవంత్‌రెడ్డి అంటున్నాడని, అంతేకాక తెలంగాణ రాష్ట్రం క్యాన్సర్‌, ఏయిడ్స్‌ పేషంట్‌ లెక్క ఉందని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి అవసరమా అని ప్రశ్నించారు.కేసీఆర్‌ ఉన్నప్పుడు అన్ని పథకాలు సక్రమంగా అమలు చేశారని, ఇప్పుడు రైతుబంధు పడడం లేదు, రుణమాఫీ కాలేదని కాలేదు అన్నారు, మహిళకు ఇస్తాన్న రూ.2500 రాలేదని, రూ 4 వేలకు పింఛన్‌ పెంచలేదని అన్నారు. నెలకు రూ. 2500 ఇవ్వలేని ముఖ్యమంత్రి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాడట అని ఎద్దేవో చేశారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ఈ సమావేశంలో నాస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళా చక్రపాణి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2026 | 12:54 AM