టీచర్లకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం వద్దు..!
ABN , Publish Date - Jul 04 , 2026 | 06:50 AM
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయ సిబ్బందికి మధ్యాహ్నభోజనం, అల్పాహారం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని..
సీఎం రేవంత్‌కు హర్షవర్ధన్‌రెడ్డి వినతి
హైదరాబాద్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయ సిబ్బందికి మధ్యాహ్నభోజనం, అల్పాహారం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి, టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధ్యాయ లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఉపాధ్యాయులకు వెచ్చించే ఖర్చును.. విద్యార్థులకే కేటాయించి మరింత నాణ్యమైన భోజనం అందించాలన్నారు.