జనగణనలో ఆదివాసీ మతం ప్రత్యేక కోడ్ ఇవ్వాలి
ABN , Publish Date - May 14 , 2026 | 04:31 AM
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనలో ఆదివాసీ మతం ప్రత్యేక కోడ్ ఇవ్వాలని, కోయత్తూరు భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలని జాతీయ ఆదివాసీ....
జాతీయ ఆదివాసీ సదస్సులో వక్తల డిమాండ్
రాంనగర్, మే 13 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనలో ఆదివాసీ మతం ప్రత్యేక కోడ్ ఇవ్వాలని, కోయత్తూరు భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలని జాతీయ ఆదివాసీ సదస్సులో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కులు - సంస్కృతి పరిరక్షణ సమన్వయ సమితి ఆధ్వర్యంలో బుధవారం జాతీయ ఆదివాసీ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 5వ షెడ్యూల్ ప్రాంతాలకు 6వ షెడ్యూల్ తరహా స్వయం పాలన కల్పించాలని, పోలవరం నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలని, 1/70 చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని, ప్రత్యేక ఆదివాసీ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబరు 3ని అవసరమైన సవరణలతో అమలు చేసి ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక ఆదివాసీ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నారు.