Share News

ఇక మిగిలింది ఆ నలుగురే..!

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:32 AM

తెలంగాణలో మావోయిస్టు పార్టీ ముగింపు దశకు చేరుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాష్ట్రానికి చెందిన రంగబోయిన భాగ్య అలియాస్‌ రూపిరెడ్డి మరణించడంతో...

ఇక మిగిలింది ఆ నలుగురే..!

  • జనజీవన స్రవంతిలోకి రండి.. మావోయిస్టులకు డీజీపీ పిలుపు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మావోయిస్టు పార్టీ ముగింపు దశకు చేరుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాష్ట్రానికి చెందిన రంగబోయిన భాగ్య అలియాస్‌ రూపిరెడ్డి మరణించడంతో, పార్టీలో తెలంగాణ నుంచి మిగిలిన వారి సంఖ్యం నాలుగుకు పడిపోయింది. ఈ నేపథ్యంలో, ఆ నలుగురైనా జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ శివధర్‌ రెడ్డి మరోసారి పిలుపునిచ్చారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న కీలక నేత లు ముప్పాళ లక్ష్మణరావు అలియాస్‌ గణపతి, ఆయ న భార్య జోడే రత్నాభాయిలతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి, రాష్ట్ర కమిటీ సభ్యుడు వార్త శేఖర్‌లు వెంటనే లొంగిపోవాలని పోలీసులు కోరుతున్నారు. అయితే గణపతి దంపతులు నాలుగేళ్ల క్రితమే అడవులను వదిలి రహస్య ప్రాంతాలకు వెళ్లినట్లు సమాచారం. వారి ఆచూకీ తె లిసిన నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో, ఆ దంపతుల ఆచూకీ పోలీసులకు చిక్కడం లేదు. మరోవైపు, ఝార్ఖండ్‌లోని సరందా అడవుల్లో మిసిర్‌ బెస్రా, పసునూరి నరహరి మాత్రమే కొద్దిపాటి క్యాడర్‌తో చురుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Apr 15 , 2026 | 04:32 AM