kumaram bheem asifabad-డీలిమిటేషన్.. సరికొత్త ఆశలు
ABN , Publish Date - Nov 29 , 2026 | 10:15 PM
అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పునర్వీభజన (డీలిమిటే షన్)పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించ డంతో నేతల్లో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రస్తుతం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియతో కొత్త స్థానాలు ఏర్పాటవుతాయనే చర్చ నేతల్లో ఆసిక్తిని పెంచు తోంది. 2029లో జరిగే ఎన్నికల నాటికి శాసనసభ, లోక్‌సభ స్థానాలు పెంచాలనే ప్రణాళికతో ముందుకు వెళుతోంది.
- పెరుగనున్న అసెంబ్లీ నియోజకవర్గం
- రాజకీయ నేతల్లో జోష్
ఆసిఫాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పునర్వీభజన (డీలిమిటే షన్)పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించ డంతో నేతల్లో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రస్తుతం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియతో కొత్త స్థానాలు ఏర్పాటవుతాయనే చర్చ నేతల్లో ఆసిక్తిని పెంచు తోంది. 2029లో జరిగే ఎన్నికల నాటికి శాసనసభ, లోక్‌సభ స్థానాలు పెంచాలనే ప్రణాళికతో ముందుకు వెళుతోంది. సోమవారం జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశంలో డీలిమిటేషన్, మహిళా బిల్లు ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పునర్వీభజన అంశం నేతల్లో ఆసక్తి రేపుతోంది. జిల్లాలో ఎటు చూసినా నియోజకవర్గాల పరిధి కొత్త నియోజకవర్గంపై ఏర్పాటుపై చర్చ మొద లైంది. ఎవరికి వారు లెక్కలు వేస్తూ నియోజకవర్గం ఎలా ఏర్పడు తుంది. ఏ మండలాలు కలుపుతారు, రిజర్వేషన్ ఎవరికి దక్కుతుందనే దానిపై ముచ్చటించుకుంటు న్నారు. మరో వైపు వివిధ పార్టీల్లోని జిల్లా నేతల్లో కొత్త ఆశలు ఆశావహుల్లో అనందోత్సవాలు కలుగుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఆసిఫాబా ద్(ఎస్టీ), సిర్పూర్ (జనరల్) రెండు నియోజకవ ర్గాలు ఉన్నాయి. డీలిమిటేషన్‌తో మరో కొత్త నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
- జిల్లాలోని 15 మండలాల్లో..
జిల్లాలో 15 మండలాల్లో 335 గ్రామపంచాయతీ లు ఉన్నాయి. జిల్లాలో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలు ఉండగా ఆసిఫాబాద్ నియోజక వర్గంలో మొత్తం 10 మండలాలు, సిర్పూర్ నియో జకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆసిఫాబాద్, వాంకి డి, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యూ), లింగాపూర్, తిర్యాణి, రెబ్బెన, ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ, నార్నూర్ మండలాలను కలుపుకొని మొత్తం 10 మండలాలు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్‌నగర్, సిర్పూర్ (టి), కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు, పెంచిక ల్‌పేట, దహెగాం మండలాలను కలుపుకొని మొ త్తం ఏడు మండలాలు ఉన్నాయి. రెండు నియో జకవర్గాల పరిధిలో సుమారు 3 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 5,15,812 మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపట్టేం దుకు కసరత్తులు చేపడుతుంది. దీంతో జిల్లాలో మరో కొత్త నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. జైనూరు లేదా ఊట్నూర్ కేంద్రం గా చేసుకొని ఏజెన్సీ మండలాలను కలుపుకొని కొత్త నియో జకవర్గం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగు తుంది. ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు, సిర్పూర్ (యు), లింగాపూర్, ఆదిలాబాద్ జిల్లా లోని నార్నూర్, గాదిగూడ, ఊట్నూర్, ఇంద్రవెల్లి మండలాలను కలుపుకొని ఎస్టీ నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో ఆసిఫాబాద్, వాంకిడి, కెరమెరి, తిర్యాణి, రెబ్బెన మండలాలను కలుపుకొని ఒక నియోజకవర్గం సిర్పూర్ నియోజ కవర్గం యదావిదిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో జిల్లాలోని కొన్ని మండలాలను కలుపుకొని ఏజేన్సీ ప్రాంతంలో కొత్తగా నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది.
- నియోజకవర్గాల పునర్వీభజనతో.
లోకసభ, శాసనసభ నియోజకవర్గాల పునర్వీ భజనతో పాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలులోకి వస్తే ప్రస్తుం ఉన్న ఎమ్మెల్యేల రిజర్వే షన్లపై కూడా ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో కొత్తగా నియోజకవర్గం ఏర్ప డితే అందు లో ఒక నియోజకవర్గం మహిళ రిజర్వుగా మారు తుందని చర్చ జరుగుతోంది.. ఈ సంవత్సరం ఏప్రిల్ మాసంలో మహిళ బిల్లు లోకస భలో వీగిపోయినప్పటికీ చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లను రిజర్వేషన్‌పై కేటాయించాలని, డీలిమిటేషన్ బిల్లు ఆమోదంపై దృష్టి సారించింది. దీంతో జిల్లాలో మహిళలకు అవకాశం దక్కనుంది. ఏజేన్సీ మండలాలను కలుపుకొని కొత్తగా నియోజక వర్గం ఏర్పాటు అయితే ఎస్టీకి కేటాయించనున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం మహిళలకు కేటాయి ంచే అవకాశాలు ఉన్నాయి. సిర్పూర్ నియోజకవ ర్గంలో రిజర్వేషన్ జనరల్‌గా యదావిదిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో మహిళలకు ఒక నియోజకవర్గంలో అవకాశం కలుగనుంది. నియోజ కవర్గాల పునర్వీభజన మహిళ బిల్లు అమోదించిన ట్ల్లయితే కొత్త వారికి అవకాశాలు లభించనున్నాయి. ఎన్నో ఏళ్లుగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారిలో ఆశలు రేకెత్తిస్తున్నాయి.