ధాన్యం కొనుగోళ్లలో జాప్యం...!
ABN , Publish Date - Nov 29 , 2026 | 10:37 PM
ధాన్యం కొను గోలు కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 20 రోజుల క్రితమే ఎక్కు వ భాగం పంటను కోసి, కళ్లాలకు తరలించిన రైతులు ధాన్యం ఎప్పుడు కొంటారోనని ఎదురు చూస్తున్నారు.
-సెంటర్ల ప్రారంభానికి పరిమితం
-కళ్లాల్లో రోజుల తరబడి మూలుగుతున్న ధాన్యం
-వర్షం భయంతో ఆందోళన చెందుతున్న రైతులు
-జిల్లాలో 289 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లక్ష్యం
మంచిర్యాల, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొను గోలు కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 20 రోజుల క్రితమే ఎక్కు వ భాగం పంటను కోసి, కళ్లాలకు తరలించిన రైతులు ధాన్యం ఎప్పుడు కొంటారోనని ఎదురు చూస్తున్నారు. అక్కడక్కడా సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించలేదు. కొనుగోళ్లలో ఆలస్యం కార ణంగా ఆరుగాలం శ్రమించి పండించిన వరిపంట అ కాల వర్షాలకు తడుస్తుందేమోన్న భయంతో రైతన్న ఆందోళన చెందుతున్నాడు. పండించిన పంటలను అష్ట కష్టాలకోర్చి కొనుగోలు కేంద్రాలకు తరలించి రోజుల త రబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరో వైపు కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేవని రైతు లు ఆవేదన చెందుతున్నారు. ఊహించని పరిస్థితుల్లో అకాల వర్షం కురిస్తే వరద నుంచి పంటను కాపాడు కొనేందుకు సరిపడా తాటి పత్రులు కూడా కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో లేవని చెబుతున్నారు.
కేంద్రాల ఏర్పాటులో జాప్యం...
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జా ప్యం జరుగుతోంది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా డీఆర్డీఏ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో మొత్తం 289 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకు న్నారు. వాటిలో అక్కడక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేసినప్పటికీ ధాన్యం కొనుగోళ్లు మాత్రం ప్రారంభిం చలేదు. ఈ సీజన్లో జిల్లాలో ఒక లక్షా 57 వేల ఎకరా ల్లో వరి పంట సాగైంది. మొత్తంగా నాలుగు లక్షల పైచిలుకు క్వింటాళ్ల దిగుబడి వస్తుందనే ఉద్దేశంతో దా నికి అనుగుణంగా ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అ యితే కొంతమంది మిల్లరు నేరుగా ధాన్యం సేకరించే అవకాశం ఉండటంతో రైతులు ప్రైవేటు మార్కెట్ వైపు మొగ్గు చూపనుండటంతో కొనుగోళ్ల లక్ష్యం కొంతమేర తగ్గుతుందనే అభిప్రాయంలో అధికారులు ఉన్నారు. ఇదిలా ఉండగా, సన్నరకాలకు తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తున్న ప్రత్యేక బోనస్ ఈ సీజన్ నుంచి పరిమితం చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ఏడు రకాల ధాన్యానికి మాత్రమే బోనస్ చెల్లించాలని నిర్ణయించింది. ధాన్యాన్ని గుర్తించేందుకు కొనుగోలు కేంద్రాల వారీగా ప్రత్యేకంగా వలంటీర్లను నియమించాలని నిర్ణయించారు. వలంటీర్ల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ కొ నుగోలు కేంద్రాల సంఖ్యకు సరిపడా అభ్యర్థుల నుంచి స్పందన లేకపోవడంతో ధాన్యాన్ని గుర్తించడం కష్టతరం అవుతుందన్న కారణంతో కొనుగోళ్లు ఆలస్యంగా చేప ట్టాలనే ఉద్దేశ్యంతోనే జాప్యం జరుగుతుందన్న ఆరోప ణలు వినిపిస్తున్నాయి.
బోనస్‌నూ లెక్క చేయని రైతులు....
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు రైతులకు అధనంగా క్వింటాలుకు రూ. 500 బోనస్‌ను అందజేస్తూ వస్తోంది. 2023-24 సీజన్ నుంచి ప్రారంభ మైన బోనస్ చెల్లింపులు ప్రతియేటా కొనసాగుతు న్నాయి. ఈ ఖరీఫ్ సీజన్లోనూ కొనసాగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ ప్రైవేటు మా ర్కెట్లో ధాన్యం విక్రయించేందుకే రైతులు మొగ్గు చూ పారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే ప్రైవేటులో అధిక ధరలు చెల్లిస్తుండటమే దీనికి కారణ మనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంధ్ర ప్రభు త్వం ప్రకటించిన మేరకు ధాన్యం గ్రేడ్-ఏ రకం క్వింటా కు రూ. 2461 కనీస మద్దతు ధర ఉండగా, రాష్ట్ర ప్రభు త్వం సన్నరకాలకు బోనస్ రూ. 500 చెల్లించనుం డటంతో క్వింటాకు రూ. 2961 ధర గిట్టుబాటు కానుం ది. అదే ప్రైవేటు మార్కెట్లో క్వింటాల్‌కు రూ.3900 నుంచి రూ. 4100 వరకు ధర పలుకుతోంది. ఎల్‌నినో ప్రభావం కారణంగా ఖరీఫ్ సీజన్ చివరిలో ఆశించిన మేర వర్షాలు లేక జిల్లాలో 20 నుంచి 30 శాతం పం టకు నష్టం వాటిల్లింది. దిగుబడి తగ్గే అవకాశాలు ఉం డటంతో ప్రైవేటు మార్కెట్లో సన్న రకాలకు డిమాం డ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏ ర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలలో విక్రయించడం కం టే ప్రైవేటులో విక్రయించడం ద్వారా గిట్టుబాటు ధర పొందాలనే ఉద్దేశ్యంతో ఉన్న అనేక మంది రైతులు తా ము పండించిన ధాన్యాన్ని ప్రైవేటు మార్కెట్లోనే విక్ర యించారు. అయితే రైతుల నుంచి వస్తున్న స్పంద న ను చూసి, వ్యాపారులు ఉన్న ఫలంగా ధరలు తగ్గించే శారు. ప్రైవేటు మార్కెట్ కంటే ప్రభుత్వపరంగా ఇస్తు న్న మద్దతు ధరలే మేలనుకున్న రైతులు విధిలేని పరిస్థితుల్లో మళ్లీ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని వి క్రయించక తప్పడం లేదు. దీంతో ప్యాడీ సెంటర్ల ఏర్పా టును అధికారులు వేగవంతం చేసినప్పటికీ ధాన్యం కొనుగోళ్లు ఇంకా ప్రారంభించకపోవడంతో రైతులు ఆం దోళన చెందుతున్నారు.