ఇందిరమ్మ జీవిత బీమాతో దీమా
ABN , Publish Date - Nov 21 , 2026 | 11:29 PM
కుటుంబా న్ని పోషించే వ్యక్తిని కోల్పో తే ఆ ఇంటిపై ఆర్థిక భారం పడుతుందని, అలాంటి కష్ట కాలంలో ఇందిరమ్మ కుటుం బ జీవిత బీమా పథకం అం డగా నిలుస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
- కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి
కల్వకుర్తి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : కుటుంబా న్ని పోషించే వ్యక్తిని కోల్పో తే ఆ ఇంటిపై ఆర్థిక భారం పడుతుందని, అలాంటి కష్ట కాలంలో ఇందిరమ్మ కుటుం బ జీవిత బీమా పథకం అం డగా నిలుస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. అర్హు లైన కుటుంబాలకు రూ. 5లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడం ద్వారావారి భవిష్యత్తుకు భరో సా లభిస్తుందని పేర్కొన్నారు. కల్వకుర్తి ముని సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డులో మునిసి పల్ చైర్ పర్సన్ బృంగి రత్నమాల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇందిరమ్మ కుటుంబ జీ విత బీమా పథకాన్ని ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పథ కం ఎవరికీ వర్తిస్తుంది, బీమా ప్రయోజనాన్ని ఎలా పొందాలనే వివరాలను అర్హులైన కుటుం బాలకు తెలియజేయాలని అధికారులకు, స్థానిక ప్రజాప్రతి నిధులకు సూచించారు. కార్యక్రమం లో పీసీబీ సభ్యుడు ఠాకూర్ బాలాజీసింగ్, మా జీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కుమార్, మునిసిపల్ వైస్ చైర్మన్ షానవాజ్‌ఖాన్, మునిసిపల్ కమి షనర్ మహమ్మద్‌షేక్, కౌన్సిలర్లు, ప్రజాప్రతి నిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.