kumaram bheem asifabad-ఉద్యమంలో దీక్షా దివస్ చారిత్రాత్మక మలుపు
ABN , Publish Date - Nov 29 , 2026 | 10:19 PM
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ చారిత్రాత్మక మలుపు అని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఆదివారం దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకు ముందు తెలంగాణతల్లి విగ్రహనికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు.
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ చారిత్రాత్మక మలుపు అని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఆదివారం దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకు ముందు తెలంగాణతల్లి విగ్రహనికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి చేపట్టిన పోరాటం యావత్ తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిందన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో సాగిన ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించిందన్నారు. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు పునాది పడిందని చెప్పారు. తెలంగాణ కోసం విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు చేసిన పోరాటాలు, త్యాగాలు మరువలేనివన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్‌ఎస్ పార్టీ కీలకపాత్ర పోషించిందని, అనాటి ఉద్యమ చరిత్రను నేటి యువతకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, పీఏసీఎస్ చైర్మన్లు అలీబిన్ అహ్మద్, పెంటు, సంజీవ్, కౌన్సిలర్ సాలం, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు జబరి రవిందర్, శ్రీధర్‌రెడ్డి, అజయ్, ఇంతియాజ్ లాలా, నాయకులు సరస్వతి, కలాం, అన్సార్, శ్రీనివాస్, అహమద్, నిసార్, నాగరాజు, అశోక్, భీమేష్, పోచయ్య, జీవన్ తదితరులు పాల్గొన్నారు.