కేసు విచారణ బాధ్యతలు రితిరాజ్‌కు
ABN , Publish Date - May 12 , 2026 | 03:57 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విచారణకు సైబరాబాద్ సీపీ ఎం.రమేశ్ ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ సిటీ, మే 11 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విచారణకు సైబరాబాద్ సీపీ ఎం.రమేశ్ ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు విచారణ పర్యవేక్షణ బాధ్యతలను కూకట్‌పల్లి జోన్ డీసీపీ రితిరాజ్‌కు సైబరాబాద్ సీపీ అప్పగించారు. విచారణ పురోగతిని ప్రతిరోజూ తనకు నివేదించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో డీసీపీ రితిరాజ్ వెంటనే రంగంలోకి దిగారు. సోమవారం సాయంత్రం పేట్‌బషీరాబాద్ పోలీ్‌సస్టేషన్‌కు చేరుకొని కేసు వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలితో మరోసారి మాట్లాడతానని, ఆధారాలు సేకరించి చర్యలు తీసుకుంటామని అన్నారు. చట్టప్రకారం బాధితులకు ఎలాంటి న్యాయం చేయాలో చేస్తామని చెప్పారు.