kumaram bheem asifabad- ఘనంగా డీసీసీ అద్యక్షురాలి జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Aug 16 , 2026 | 11:25 PM
జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం డీసీసీ అద్యక్షురాలు ఆత్రం సుగుణ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేం ద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు డీసీసీ అధ్యక్షురాలు సుగుణ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి మొక్కలు నాటారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం డీసీసీ అద్యక్షురాలు ఆత్రం సుగుణ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేం ద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు డీసీసీ అధ్యక్షురాలు సుగుణ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కరానికి నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తారీఖ్, మురళీ, మారుతి పటేల్, ఇమ్రాన్, నాంపల్లి శంకర్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆత్రం శంకర్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆత్రం దౌలత్‌రావు,సర్పంచులు పెందోర్ గణపత్‌రావు, మెస్రం స్పంధనభూపతి, ఆత్రం విజయభీర్‌షా, ఉప స్రంచ్ పెందొర్ రాము, నాయకులు శ్రీనివాష్, దేవిదాస్, ఆత్రం లచ్చు పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి):మండల కేంద్రంలో ఆదివారం డీసీసీ అధ్యరాక్షులు ఆత్రం సుగణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రశీద్, డీసీసీ కార్యవర్గ సభ్యుడు పెందోర్ ప్రకాష్, సర్పంచ్ కనక ప్రతిభ, తోడసం రాజేందర్, ఉయిక చందన్, పెందోర్ అనుసూయఅర్జున్, ఆత్రం నిర్మలశశిపాల్, ఆదివాసీ నాయకుడు కుమ్రదుదేరావు తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని గోలేటి టౌన్ షిప్‌లోని వృద్ధాశ్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సగుణ తన పుట్టిన రోజును పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. అనంతరం ఐఎన్‌టీయూసీ కార్యాలయంలో జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ బెల్లంపల్లి ఏరియా ప్రసిడెంట్ పేరం శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తిర్యాణి, (ఆంఽధ్రజ్యోతి): మండల కేంద్రంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ జన్మదిన వేడుకల సందర్భంగా నాయకులు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ నైతం రాజేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుటు కొట్నాక గణపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్సెంగ శోభన్, వెంకన్న, అంకం గౌరయ్య, రమేష్, పులి కొమురయ్య, వల్క రాంచందర్‌తో పాటు తదిరతులు పాల్గొన్నారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ జన్మదిన వేడకల ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అఽధ్యక్షుడు సుజాయిత్ ఖాన్, డీసీసీ జిల్లా కార్యదర్శి రాథోడ్ శంకర్ నాయక్, ఉప సర్పంచి వాగ్మార శ్రీకాంత్, సీనియర్ నాయకులు రాథోడ్ సుదర్శన్, రాథోడ్ మారుతీ, పిట్ల గిడ్డప్ప, రాథోడ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.