24 మందితో డీసీసీ నియామకం
ABN , Publish Date - Mar 19 , 2026 | 11:30 PM
జిల్లా కాంగ్రెస్ కమిటీకి పూర్తిస్థాయి కార్యవర్గా న్ని నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ గురువారం నియామక ఉత్తర్వుల ను జారీ చేశారు.
- ప్రకటించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
నాగర్‌కర్నూల్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కాంగ్రెస్ కమిటీకి పూర్తిస్థాయి కార్యవర్గా న్ని నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ గురువారం నియామక ఉత్తర్వుల ను జారీ చేశారు. 24మందికి ఇందులో చోటు క ల్పించారు. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని బీసీలకు పెద్దపీట వేశారు. అచ్చంపే ట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ మూడవ సారి కూడా జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉపాధ్యక్షులుగా కట్ట అనం తరెడ్డి, హరినారాయణగౌడ్, మాధవరెడ్డి, రాము యాదవ్, రంగినేని జగదీశ్వరుడు నియమితుల య్యారు. జనరల్ సెక్రటరీలుగా బలరాంగౌడ్, పులిజాల కృష్ణారెడ్డి, రామనాథం, వెంకట్‌రెడ్డి, నాగేశ్వర్‌రావు, రామలింగయ్య యాదవ్, వెంక ట్రాంరెడ్డి, వెంకటయ్యగౌడ్, రామచంద్రారెడ్డి, తిరుపతిరెడ్డి, వెంకటస్వామి, వేణుగోపాల్ యా దవ్‌లు ఎంపికవగా, కార్యదర్శులుగా ఆనంద్, కోశాధికారిగా రఘురాం, అధికార ప్రతినిధు లుగా కపిలవాయి శేఖర్, శ్రీకాంత్‌రెడ్డి, కృష్ణారె డ్డి, విష్ణులను నియమించారు.