Share News

డీబీటీ సేవలు మరింత సులభతరం

ABN , Publish Date - Oct 03 , 2026 | 06:39 AM

ప్రభుత్వ పథకాల కింద లబ్థిదారులకు అందించే డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) సేవలు మరింత సులభతరం కానున్నాయి. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా అందే నగదు, సబ్సిడీలు లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా బదిలీ చేసే పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (పీఎఫ్ఎంఎస్‌) వ్యవస్థకు ఆధార్‌ ఆధారిత ధ్రువీకరణలో కీలక గుర్తింపు లభించింది.

డీబీటీ సేవలు మరింత సులభతరం

  • పీఎఫ్ఎంఎస్‌కు ఆధార్‌ సంస్థ గుర్తింపు: సీజీఏ

హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాల కింద లబ్థిదారులకు అందించే డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) సేవలు మరింత సులభతరం కానున్నాయి. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా అందే నగదు, సబ్సిడీలు లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా బదిలీ చేసే పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (పీఎఫ్ఎంఎస్‌) వ్యవస్థకు ఆధార్‌ ఆధారిత ధ్రువీకరణలో కీలక గుర్తింపు లభించింది. అత్యంత వేగంగా ఆధార్‌ ఆథెంటికేషన్‌ యూజర్‌ ఏజెన్సీ (ఏయూఏ)గా చేరిన సంస్థగా.. యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) నుంచి పీఎఫ్ఎంఎస్‌ ప్రత్యేక గుర్తింపు పొందింది. కేంద్ర ఆర్థికశాఖ వ్యయ విభాగం పరిధిలో, కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) ఆధ్వర్యంలో పీఎఫ్ఎంఎస్‌ పనిచేస్తోంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక వ్యవస్థలతో పీఎఫ్ఎంఎస్‌ ఇప్పటికే అనుసంధానమై ఉండటంతో డిజిటల్‌ చెల్లింపులు, నిధుల బదిలీ, ఆర్థిక నివేదికలను నిర్వహించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. తాజాగా ఏయూఏగా హోదా దక్కడంతో లబ్ధిదారుల గుర్తింపును నిర్ధారించేందుకు ఓటీపీ, బయోమెట్రిక్‌ వంటి ఆధార్‌ ప్రామాణీకరణ సేవలను నేరుగా ఉపయోగించుకునే అధికారిక అనుసంధానం ఏర్పడింది.

Updated Date - Oct 03 , 2026 | 06:39 AM