Share News

kumaram bheem asifabad- వైభవంగా దసరా వేడుకలు

ABN , Publish Date - Oct 21 , 2026 | 11:12 PM

జిల్లావ్యాప్తంగా మంగళవారం దసరా వేడుకలు వైభవంగా నిర్వహించారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో మంగళవారం దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక త్రిశూల్‌ పహాడ్‌ వద్ద ఏర్పాటు చేసిన రావణసురుడి దిష్టి బొమ్మను జిల్లా ఎస్పీ నితికపంత్‌ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌, సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కోనేరు కోనప్ప, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు

kumaram bheem asifabad- వైభవంగా దసరా వేడుకలు
కాగజ్‌నగర్‌లో రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్న ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌, సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు, ఎస్పీ నితికాపంత్‌

కాగజ్‌నగర్‌/సిర్పూర్‌(టి)/కౌటాల/రెబ్బెన/చింతలమానేపల్లి/దహెగాం/పెంచికల్‌పేట/తిర్యాణి/వాంకిడి/బెజ్జూరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా మంగళవారం దసరా వేడుకలు వైభవంగా నిర్వహించారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో మంగళవారం దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక త్రిశూల్‌ పహాడ్‌ వద్ద ఏర్పాటు చేసిన రావణసురుడి దిష్టి బొమ్మను జిల్లా ఎస్పీ నితికపంత్‌ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌, సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కోనేరు కోనప్ప, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.. త్రిశూల్‌ పహాడ్‌పై జమ్మి చెట్టుకు సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు ప్రత్యేక పూజలు చేశారు. సర్‌సిల్క్‌ ఎల్‌బీఎస్‌ మార్కెట్‌లో కూడా రావణసుర దహన కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. త్రిశూల్‌ పహాడ్‌పై జరిగిన రావణసుర దహనం కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నితిక పంత్‌ ప్రారంభించారు. సిర్పూరు(టి) మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామ పంచాయతీల్లో మంగళవారం దసరా పండుగను ఘనంగా నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో దసరా పండుగను పురస్కరించుకొని రథోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌ సందర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కౌటాల మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామ పంచాయతీల్లో మంగళవారం దసరా పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి మండల వాసులు తమ వాహనాలకు ఆయుధ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రెబ్బెన మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామ పంచాయతీల్లో మంగళవారం దసరా పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. చింతలమానేపల్లి మండల కేంద్రంలో మంగళవారం దసరా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో పలు ఆయుధాలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కమలాకర్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. దహెగాం మండల కేంద్రంలో మంగళవారం దసరా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్‌స్టేషన్‌లో పలు ఆయుధాలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పెంచికల్‌పేట్‌ మండల వ్యాప్తంగా దసరా వేడుకలను ప్రజలు ఉత్సాహంగా జరుపుకు న్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై అనిల్‌ కుమార్‌ ఆయుధపూజ నిర్వహించారు. తిర్యాణి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామ పంచాయతీల్లో మంగళవారం దసరా పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. వాంకిడి మండల కేంద్రానికి సమీపంలో గల జమ్మి చెట్టు వద్దకు వెళ్లి ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించి ఒకరికొకరు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సై మహేందర్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బెజ్జూర్‌, మండలంలో దసరా పండుగను ఘనంగా జరుపుకున్నారు.మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో శమీ వృక్షానికి పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు

Updated Date - Oct 21 , 2026 | 11:13 PM