Share News

kumaram bheem asifabad- ప్రమాదకరంగా మూల మలుపులు

ABN , Publish Date - Nov 01 , 2026 | 10:52 PM

మండల కేంద్రం నుంచి ధాబా వెళ్లె రహదారిపై ఎస్సీ వసతిగృహం ఎదురుగా ఉన్న మూల మలుపుతో పాటు ఖమన గ్రామ సమీపంలో గల మూల మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. వాంకిడి మండల కేంద్రం నుంచి సవ్వాతి, ధాబా, నవేధరి, చిచ్‌పల్లి, బండకాసా, డొడ్డిగుడ, తదితర గ్రామాలకు ప్రతి రోజు ప్రజలు తదితర పనుల నిమిత్తం రాకపోకలు చేస్తుంటారు. నిత్యం ద్విచక్రవాహనాలు, ఆటోలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో పాటు ఎస్సీ, బిసి వసతి గృహంలో చదువుకుం టున్న విద్యార్థులతో పాటు ఈ రహదారిపై ఉన్న గ్రీన్‌వుడ్‌ పాఠశాలకు విద్యార్థులు నిత్యం రాకపోకలు చేస్తుంటారు

kumaram bheem asifabad-  ప్రమాదకరంగా మూల మలుపులు
ప్రమాదకరంగా ఉన్న ఖమన మూల మలుపు

వాంకిడి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం నుంచి ధాబా వెళ్లె రహదారిపై ఎస్సీ వసతిగృహం ఎదురుగా ఉన్న మూల మలుపుతో పాటు ఖమన గ్రామ సమీపంలో గల మూల మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. వాంకిడి మండల కేంద్రం నుంచి సవ్వాతి, ధాబా, నవేధరి, చిచ్‌పల్లి, బండకాసా, డొడ్డిగుడ, తదితర గ్రామాలకు ప్రతి రోజు ప్రజలు తదితర పనుల నిమిత్తం రాకపోకలు చేస్తుంటారు. నిత్యం ద్విచక్రవాహనాలు, ఆటోలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో పాటు ఎస్సీ, బిసి వసతి గృహంలో చదువుకుం టున్న విద్యార్థులతో పాటు ఈ రహదారిపై ఉన్న గ్రీన్‌వుడ్‌ పాఠశాలకు విద్యార్థులు నిత్యం రాకపోకలు చేస్తుంటారు. అదే విదంగా వాంకిడి నుండి ఖమన, కనర్‌గాం మీదుగా కాగజ్‌నగర్‌కు ప్రతి రోజు పదుల సంఖ్యలో వాహనాలు కారకపోకలు చేస్తుంటారు. ఎస్సీ వసతి గృహం ఎదురుగా ఉన్న మూల మలుపు వద్ద, ఖమన, కోమటిగూడ మూల మలుపువద్ద ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించక గతంలో అనేక ప్రమాదాలు జరిగిన సంఘటణలు ఉన్నాయి.

- చెట్ల కొమ్ములు వాలి ఉండడంతో

మూల మలుపుల వద్ద చెట్ల కొమ్మలు వాలి ఉండడంతో ఎదురుగా వచ్చే వాహ నాలు, చోదకులకు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ వ సతి గృహం ఎదురుగా ఉన్న మూల మలుపు పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్లె సమయంలో ఎప్పుడు ఎం జరుగుందో అని విద్యార్థుల తల్లి తండ్రులు భయందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా ఖమన, కోమటిగూడ గ్రామ సమీపంలో ఉన్న మూల మలుపులు ప్రమాదాలకు నీలయంగా తయారైనాయి. వాంకిడి మండలంలోని వివిద గ్రామాల నుంచి ప్రజలు ఈ రోడ్డు ద్వారానే కాగజ్‌నగర్‌కు ప్రతి రోజు రాకపోకలు చేస్తుంటారు. మూల మలుపుల వద్ద ఏలాంటి ప్రమాద సూచిక బోర్డోలు ఏర్పాటు చేయకపోవడంతో అనేక మంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. గత ఏడాది ఖమన నుండి కాగజ్‌నగర్‌ వరకు బిటీ రోడ్డును నిర్మించిన సదరు కాంట్రాక్లర్‌ మూలమలుపుల వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో రాత్రి సమయంలో వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. సంబందిత అధికారులు మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Nov 01 , 2026 | 10:52 PM