kumaram bheem asifabad- ప్రమాదరకంగా మూలమలుపులు
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:15 PM
ప్రధాన రహదారులపై మలుపులు ప్రమాదక రంగా ఉన్నాయి. కనీసం సూచికలు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం లేదు. మలుపుల వద్ద చెట్ల పొదలను తొలగించడం లేదు. ఫలి తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
- ఇబ్బందుల్లో వాహనదారులు
బెజ్జూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రధాన రహదారులపై మలుపులు ప్రమాదక రంగా ఉన్నాయి. కనీసం సూచికలు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం లేదు. మలుపుల వద్ద చెట్ల పొదలను తొలగించడం లేదు. ఫలి తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఎంతో మంది క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోయి అనాథులుగా మారుతున్నారు. జిల్లాలో పలుచోట్ల ప్రమాదకర పరిస్థితులున్నాయి. బెజ్జూరు మండలంలోని సలుగుపల్లి పల్లె ప్రకృతివనం వద్ద, రెబ్బెన సమీపంలో, గొల్లబాయి చెరువు వద్ద, సలుగు పల్లి-సు లుగుపల్లి మద్య గ్రామాలకు వెళ్లే దారులపై మూలమలుపుల వద్ద ఎలాంటి సూచికలు లేక పోవడంతో ప్రమాదాలు చోటు చేసు కుంటున్నాయి.
- గత రెండేళ్లుగా..
మండలంలో గత రెండేళ్లుగా జరిగిన రోడ్డు ప్రమా దాల్లో పలువురు మృత్యువాత పడి కుటుంబానికి పెద్దదిక్కులు కోల్పో యారు. అంతే కాకుండా ఎంతో మంది క్షత గాత్రులుగా మిగిలారు. తాజాగా సలుగుపల్లి వద్ద గత గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమా దంలో ఒకరు తీవ్ర గాయాలతో క్షతగాత్రుడిగా మారారు. ఇలా ప్రతి ఏటా మూలమలుపుల వద్ద జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో కొందరు చనిపోతుండగా, మరి కొందరు తీవ్ర గాయాలతో సతమతమవుతు న్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చుతున్నా యి. ఇక జిల్లా వ్యాప్తంగా పలు మండలా ల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయినా అధి కారులు ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయ డం లేదు. మూలమలుపుల వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవించి అమాయక ప్రజలు బలవుతున్నా అధికార యంత్రాంగం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మూలమలు పులు, వాటి వద్ద పొదలు కప్పేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతు న్నాయి. అధికారుల సరైన దృష్టి సారించని ఫలితం గా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్న అభిప్రాయాలున్నాయి. మూలమలుపుల వద్ద కనీసం సూచికలు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసిన ట్లయితే కొంతమేర ప్రమాదాలు జరగకుండా నివారించ వచ్చని పలువురు చెబుతున్నారు.