Share News

kumaram bheem asifabad- డేంజర్‌ డెంగీ

ABN , Publish Date - Jul 30 , 2026 | 11:05 PM

వర్షాకాలం ప్రారంభం కావడంతో దోమల బెడద పెరిగింది. ఇలాంటి చోట డెంగీ వ్యాప్తికి అనుకూలంగా ఉంటుం ది. కొన్ని వారాలుగా జిల్లాలో జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతుం ది. ఈ జ్వరాలు డెంగీ కావచ్చు. ప్రజలు అప్రమత్తం గా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, నిపుణులు హెచ్చరిస్త్తున్నారు. డెంగీ అనేది ఎడిస్‌ ఈజిప్టి అనే ఆడ దోమ కాటు ద్వారా వ్యాపించే వైర్‌స్‌ వ్యాధి. ఈ దోమ పగటిపూట కుడుతుంది.

kumaram bheem asifabad- డేంజర్‌ డెంగీ
లోగో

- పరిసరాల పరిశుభ్రతతోనే చెక్‌

వాంకిడి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం ప్రారంభం కావడంతో దోమల బెడద పెరిగింది. ఇలాంటి చోట డెంగీ వ్యాప్తికి అనుకూలంగా ఉంటుం ది. కొన్ని వారాలుగా జిల్లాలో జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతుం ది. ఈ జ్వరాలు డెంగీ కావచ్చు. ప్రజలు అప్రమత్తం గా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, నిపుణులు హెచ్చరిస్త్తున్నారు. డెంగీ అనేది ఎడిస్‌ ఈజిప్టి అనే ఆడ దోమ కాటు ద్వారా వ్యాపించే వైర్‌స్‌ వ్యాధి. ఈ దోమ పగటిపూట కుడుతుంది. డెంగీ సోకిన వారికి సాధారణంగా 2 నుంచి 7 రోజుల పాటు జ్వరం ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలు తీవ్రం గా ఉంటాయి. జ్వరంతో పాటు తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం అత్యవసరం

- ప్రాణాపాయ పరిస్థితులు..

డెంగీ జ్వరం సాధారణంగా తేలికపాటి లక్షణాలతో ప్రారంభమైనప్పుటికీ కొందరిలో ఇది తీవ్ర రూపం దాల్చి ప్రాణాంతకంగా మారవచ్చు. డెంగీ వైరస్‌ శరీరంలోని రక్త నాళాలను దెబ్దతీసి ప్టేట్‌లెట్ల సంఖ్యను విపరీతంగా తగ్గిస్తుంది. ప్లేట్‌లెట్లు రక్తం గడ్డకట్టడంతో కీలకపాత్ర పోషిస్తాయి. వాటి సంఖ్య తగ్గడం వల్ల శరీరంలో అంతర్గత రక్త స్రావం జరిగే ప్రమాదం ఉంది. ఇది జీర్ణవ్యవస్థలో, చర్మం కింద, లేదా ఇతర అవయవాలలో రక్త స్రావానికి దారితీస్తుంది. జ్వరం తగ్గిన తర్వాత 24-48 గంటలు అత్యంత కీలకమైన సమయం. ఈ సమయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో చేరాలి. కడుపులో విపరీతమైన నొప్పి, తరుచుగా వాంతులు కావడం, శ్వాసలో ఇబ్బంది లేదా వేగంగా తీసుకో వడం, చిగుళ్లు లేదా ముక్కు నుంచి రక్తం కారడం, నల్లటి మలం లేదా వాంతులలో రక్తం కనిపించడం, చల్లగా, చెమటలు పట్టి బీపీ పడిపోవడం ఈ లక్షణాలు డెంగీ షాక్‌ సిండ్రోమ్‌ (డీఎస్‌ఎస్‌) లేడా డెంగీ హెమరేజిక్‌ ఫీవర్‌ (డీహెచ్‌ఎఫ్‌) కు సంకే తాలు కావచ్చు. ఈ దశలో తక్షణ వైద్యసహాయం అందకపోతే అవయవ వైఫల్యం సంభవించి మర ణానికి దారితీయవచ్చు.

- జాగ్రత్తలు ఇలా..

ఫ ఇంటి పరిసరాల్లో, కూలర్లు, కుండీల్లో, టైర్లలో, ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమలు గుడ్లు పెట్టడానికి ఇవి అనుకూలం

ఫ ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మురుగునీటి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలి.

ఫ దోమతెరలు వాడడం మంచిది. దోమల నివారణ క్రీములు లేదా స్ర్పేలు ఉపయోగిండం మంచిది.

ఫ పొడవాటి చేతులున్న దుస్తులు ధరించడం ద్వారా దోమకాటు నుంచి రక్షణ పొందవచ్చు.

ఫపౌష్టికాహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

రెండు రోజుల్లో జ్వరం తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి..

- రవిదాస్‌ - వాంకిడి హెచ్‌ఈవో

రెండు రోజుల్లో జ్వరం తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి. గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తూ జ్వరాలపై ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాం. ఇంటి పరిసరాల్లో పరిశుబ్రత లోపించకుండా ప్రజలు జార గత్తలు తీసుకోవాలి. ఇళ్లల్లో ఖాళీ టబ్బులు, డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. రెండు రోజుల వరకు జ్వరం తగ్గకపోతే విధిగా వైద్యుడిని సంప్ర దించాలి. లక్షకు తక్కువగా ప్లేట్‌లెట్‌ కౌంట్‌ ఉంటే అప్రమత్తం కావాలి. డెంగీ వ్యాధి అని నిర్ధారణ అయి తే వెంటనే ఆసుపత్రిలో చేర్పించి తగిన చికిత్స అందిం చాలి. డెంగీ వంటి తీవ్ర జ్వరాల లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడి సలహా తీసుకోవాలి.

Updated Date - Jul 30 , 2026 | 11:05 PM