kumaram bheem asifabad- గిరిజన సంప్రదాయాలకు ప్రతీక దండారీ ఉత్సవాలు
ABN , Publish Date - Nov 11 , 2026 | 10:36 PM
రిజను సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది గుస్సాడి, దండారీ ఉత్సవాలు అని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. మండలంలోని సాంగ్వీ, కర్పెతగూడ, నాగల్‌గోంది గ్రామాల్లో బుధవారంనిర్వహించిన ఆదివాసి గుస్సాడీ, దండారీ వేడుకల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి అజ్మీర శ్యాంనాయక్‌తో కలిసి డీసీసీ అధ్యక్షురాలు పాల్గొన్నారు.
కెరమెరి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): గిరిజను సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది గుస్సాడి, దండారీ ఉత్సవాలు అని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. మండలంలోని సాంగ్వీ, కర్పెతగూడ, నాగల్‌గోంది గ్రామాల్లో బుధవారంనిర్వహించిన ఆదివాసి గుస్సాడీ, దండారీ వేడుకల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి అజ్మీర శ్యాంనాయక్‌తో కలిసి డీసీసీ అధ్యక్షురాలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆదివాసిల సంస్కృతిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. దండారిలకు రూ.15వేలను ప్రభుత్వం విడుదల చేసినట్టు తెలిపారు. ఆదివాసి గ్రామాల్లో గుస్సాడి బృందాలకు ప్రత్యేక షెడ్ల నిర్మాణం చేపట్టేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అలాగే ఫారెస్టు అధికారులతో మాట్లాడి రోడ్డు నిర్మాణానికి కూడా కృషి చేస్తామని తెలిపారు. 70 కుటుంబాలకు ఒకటే బోర్ ఉండటంతో కలెక్టర్‌తో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించేట్టు మరో బోర్ వెల్ ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆసిఫాబాద్ నియోవజకర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి అజ్మీర శ్యాం నాయక్ మాట్లాడుతూ గిరిజనుల సంప్రదాయాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుజాయిత్‌ఖాన్, రాజీవ్ గాంధీ సంఘటన్ అభియాన్ జిల్లా అధ్యక్షురాలు కోవ ఇందిర, మాజీ సర్పంచ్ జగన్నాథ్, జాదవ్ ప్రకాష్, నాగేష్, తిరుపతి, బాపురావు, సుదర్శన్, దేవిదాద్, ధర్ము, వినయ్ దేవరతో పాటు తదితరులు పాల్గొన్నారు.