శాస్త్రోక్తంగా నిత్య పూజలు
ABN , Publish Date - May 02 , 2026 | 11:56 PM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శనివారం శాస్త్రోక్తంగా నిత్య పూజలు జరిగాయి.
యాదగిరిగుట్ట, మే 2(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శనివారం శాస్త్రోక్తంగా నిత్య పూజలు జరిగాయి. సుప్రభాత సేవతో మేల్కొల్పిన అర్చకులు గర్భగుడిలో కొలువుదీరిన స్వ యంభువులను, సువర్ణ ప్రతిష్టామూర్తులను వేదమంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ పంచామృ తాలతో అభిషేకించి తులసీ దళాలతో అర్చించారు. ప్రాకార మండపంలో సుదర్శన హోమం, నిత్య కల్యాణోత్సవం ఆగమశాస్త్రరీతిలో చేపట్టారు. అష్టభుజి ప్రాకార మం డపంలో స్వామి అమ్మవారిని అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్ది సు దర్శన శతక పఠనాలతో హవనం నిర్వహించారు. అనంతరం గజవా హన సేవలో ఊరేగించి విశ్వక్సేనుడి తొలిపూజలతో నిత్య తిరుకల్యా ణోత్సవం ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. సాయంత్రం ప్రధానాలయ ముఖమండపంలో దర్బారు సేవోత్సవం చేపట్టిన ఆచార్యులు సాయంత్రం అలంకార వెండి జోడు సేవలు, సహస్రనా మార్చనలు నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో నిత్యకైంకర్యాలు వేదమంత్రాలు మంగళవాయిద్యాల నడుమ వైభవంగా నిర్వహించారు. శివాలయంలో పర్వతవర్థిని సమేతా రామలింగేశ్వరస్వామికి మహామండపంలో స్ఫటిక మూర్తులకు నిత్యారా ధనలు, యాగశాలలో నిత్య రుద్రహవన పూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.40,25,206ల ఆదాయం సమకూ రినట్లు దేవస్థానం ఈవో భవానీశంకర్ తెలిపారు. స్వామివారి హుండీ ఆదాయా న్ని ఈనెల 5న నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.
మట్టపల్లి ఆలయంలో సూక్త సహిత మహాలక్ష్మీయాగం
మఠంపల్లి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మట్టపల్లి లక్ష్మీనృసింహుడి క్షేత్రంలో శనివారం శ్రీమాన్ హరికిరణ్‌చార్యుల ఆధ్వర్యంలో వేద పండితులు శ్రీసూక్తసహిత మహాలక్ష్మీయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని దేవతల సాక్షిగా మహాయాగం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈవో జ్యోతి, అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, కృష్ణామాచార్యులు, రామాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు, లక్ష్మీనరసింహామూర్తి, సీతారామశాస్ర్తీ, శేషగిరిరావు, శ్రీనివాసరావు, సీత పాల్గొన్నారు. మట్టపల్లి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి తిరుకల్యాణోత్సవంలో భాగంగా నాలుగో రోజు శనివారం కొనసాగాయి. ఉదయం 6గంటలకు ప్రాత: కా లార్చన, సుప్రభాతం, ద్రవిడ ప్రబంధ సేవాకాలం, మూలవిరాట్ అభి షేకం, అర్చనాదులు, ప్రాభోది, మంత్రపుష్ప నీరాజనములు, ఉదయం 9గంటలకు శ్రీరాజలక్ష్మీ, చెంచులక్ష్మి అమ్మవార్ల సహస్ర కుంకుమార్చన అనంతరం వేదపండితులు శ్రీసూక్త సహిత మహాలక్ష్మీయాగం నిర్వహించారు. రాత్రి 7గంటలకు పవిత్ర కృష్ణానదీలో హంసవాహన ఉత్సవం విద్యుత్, పూల అలంకరణతో వైభవంగా నిర్వహించారు.