Share News

ప్రజా భద్రతలో సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కీలకం

ABN , Publish Date - Aug 23 , 2026 | 06:33 AM

ప్రజా భద్రతలో సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కీలకంగా మారిందని తెలంగాణ డీజీపీ ిసీవీ ఆనంద్‌ చెప్పారు.

ప్రజా భద్రతలో సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కీలకం

  • డీజీపీ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ప్రజా భద్రతలో సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కీలకంగా మారిందని తెలంగాణ డీజీపీ ిసీవీ ఆనంద్‌ చెప్పారు. కౌన్సిల్‌ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సభ్యులు, భాగస్వామ్య సంస్థలకు ఆయన అభినందనలు తెలిపారు. పోలీసు వ్యవస్థ ప్రజలకు మరింత చేరువ కావాలంటే ప్రజలు, ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యం అవసరమని చెప్పారు. 2006 ఆగస్టు 23న ఏర్పాటైన సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షి్‌పతో ప్రజా భద్రతకు సంబంధించి అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిందన్నారు. తాను సైబరాబాద్‌ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో పోలీసులతో కలిసి పనిచేేసలా సెక్యూరిటీ కౌన్సిల్‌ను బలోపేతం చేశామని చెప్పారు.

Updated Date - Aug 23 , 2026 | 06:35 AM