Share News

రూ.5 కోట్ల డ్రగ్స్‌ దహనం

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:09 AM

డ్రగ్స్‌ నిర్మూలన చట్టం కింద వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.5.02కోట్ల విలువైన 833.18కిలోల మాదకద్రవ్యాలను సైదరాబాద్‌ పోలీసులు శనివారం కాల్చేశారు.

రూ.5 కోట్ల డ్రగ్స్‌ దహనం

హైదరాబాద్‌ సిటీ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ నిర్మూలన చట్టం కింద వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.5.02కోట్ల విలువైన 833.18కిలోల మాదకద్రవ్యాలను సైదరాబాద్‌ పోలీసులు శనివారం కాల్చేశారు. పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా రంగారెడ్డి జిల్లా ఈదులపల్లి గ్రామంలోని జీజె మల్టీక్లేవ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేసిన అధీకృత ఇన్సినరేషన్‌ యూనిట్‌లో వాటిని దహనం చేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ రమేశ్‌ ఆదేశాల మేరకు డ్రగ్‌ డిస్పోజల్‌ కమిటీ చైర్మన్‌, క్రైమ్‌, ఈవోడబ్ల్యూ డీసీపీ ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ ముత్యంరెడ్డి మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలను అరికట్టడానికి సైబరాబాద్‌ పోలీసులు రాజీ లేకుండా చర్యలు కొనసాగిస్తున్నారని తెలిపారు. కేసుల విచారణ పూర్తయి, కోర్టుల అనుమతులు పొందిన తర్వాతనే ఈ డ్రగ్స్‌ను చట్టబద్ధంగా ధ్వంసం చేశామని.. తద్వారా అవి మళ్లీ అక్రమ మార్కెట్‌లోకి వెళ్లకుండా నిరోధిస్తున్నామని చెప్పారు.

Updated Date - Jul 05 , 2026 | 05:09 AM