వివాదాస్పద స్థలం విక్రయించి మోసం
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:40 AM
కోర్టులో పెండింగ్‌లో ఉన్న వివాదానికి సంబంధించిన స్థలాన్ని విక్రయించి రూ.2.5 కోట్లకు పైగా మోసం చేసిన ఘటనపై సైబరాబాద్ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం ...
సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో ఐదుగురిపై కేసు నమోదు
హైదరాబాద్ సిటీ, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): కోర్టులో పెండింగ్‌లో ఉన్న వివాదానికి సంబంధించిన స్థలాన్ని విక్రయించి రూ.2.5 కోట్లకు పైగా మోసం చేసిన ఘటనపై సైబరాబాద్ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం (ఈవోడబ్ల్యూ) ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసింది. 2024 జూన్‌లో అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గ్రామంలో సర్వే నెంబర్ 967లో ఉన్న 800 చదరపు గజాల ప్లాట్లను కాసులబాడ కృష్ణ నుంచి కూకట్‌పల్లికి చెందిన వ్యాపారి కొనుగోలు చేశారు. ఆ స్థలానికి సంబంధించి సంగారెడ్డి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఓఎస్ నెంబర్ 575/2020 కేసు పెండింగ్‌లో ఉండటంతో పాటు, 2020 సెప్టెంబరు 23న కోర్టు ‘స్టేటస్ కో’ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని విక్రేతలు ఉద్దేశపూర్వకంగానే దాచారని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. దీంతో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కాసులబాడ కృష్ణ, ఎస్. దామోదర్‌రెడ్డి, ఉన్నం శ్రీనివా్‌సనాయు డు, ఉన్నం పార్థసారధి, ఉన్నం వెంకటేశ్వర్లుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.