పైరసీ కట్టడికి సమన్వయంతో పని చేయాలి
ABN , Publish Date - Mar 17 , 2026 | 05:18 AM
పైరసీ ఇప్పుడు అత్యంత వ్యవస్థీకృత సైబర్ నేర వ్యవస్థగా మారిందని, దీన్ని ఎదుర్కొనేందుకు చట్టం అమలు సంస్థలు, సినీ పరిశ్రమ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని....
సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయెల్
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): పైరసీ ఇప్పుడు అత్యంత వ్యవస్థీకృత సైబర్ నేర వ్యవస్థగా మారిందని, దీన్ని ఎదుర్కొనేందుకు చట్టం అమలు సంస్థలు, సినీ పరిశ్రమ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయెల్ పేర్కొన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలోని యాంటీ పైరసీ యూనిట్ ఆధ్వర్యంలో యాంటీ పైరసీ డిస్‌క్లైమర్, సినీ పైరసీ కేసుల దర్యాప్తులో అనుసరించాల్సిన విధానాలపై రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎ్‌సవోపీ)లను తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దగ్గుబాటి సురే్‌ష్ బాబుతో కలిసి సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శిఖాగోయెల్ మాట్లాడుతూ...పైరసీ డిస్‌క్లైమర్ ప్రజల్లో అవగాహన పెంచి అక్రమ రికార్డింగ్, పంపిణీని నిరోధించేలా ప్రభావం చూపుతుందన్నారు. పైరసీ సినీ పరిశ్రమపై తీరని ఆర్థిక ప్రభావం చూపుతోందని సురేష్ బాబు అన్నారు. సినీ నిర్మాణం, పంపిణీ, ప్రదర్శనలో భాగమైన అన్ని విభాగాలు కలిసి బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.