Share News

గ్యాస్‌ బుకింగ్‌ల పేరిట సైబర్‌ కేటుగాళ్ల బురిడీ!

ABN , Publish Date - Mar 12 , 2026 | 04:58 AM

పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపఽథ్యంలో వంట గ్యాస్‌ బుకింగ్‌లకు ఇబ్బందులు మొదలవడాన్ని సైబర్‌ నేరగాళ్లు అవకాశంగా మార్చుకున్నారు...

గ్యాస్‌ బుకింగ్‌ల పేరిట సైబర్‌ కేటుగాళ్ల బురిడీ!

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపఽథ్యంలో వంట గ్యాస్‌ బుకింగ్‌లకు ఇబ్బందులు మొదలవడాన్ని సైబర్‌ నేరగాళ్లు అవకాశంగా మార్చుకున్నారు. వంట గ్యాస్‌ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకొని.. తక్షణ గ్యాస్‌ డెలివరీ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలిచ్చి బురిడీ కొట్టిస్తున్నారు. వాట్సాప్‌, ఎస్‌ఎంఎ్‌సల ద్వారా ఫేక్‌ వెబ్‌సైట్‌ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. లింకులు ఓపెన్‌ చేయగానే వివరాలు నమోదు చేయడంతో పాటు.. డబ్బులు చెల్లించాలని సూచించి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇందుకు నకిలీ ఎల్‌పీజీ, ఇండియన్‌, భారత్‌ గ్యాస్‌ వెబ్‌సైట్లను సైతం ప్రారంభించారు. బాధితుల నుంచి వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండటంతో సైబర్‌ క్రైం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నకిలీ లింకులను నమ్మి క్లిక్‌ చేయొద్దని హెచ్చరించారు. సిలిండర్‌ బుకింగ్‌, ఆన్‌లైన్‌ చెల్లింపుల కోసం గ్యాస్‌ కంపెనీల అధికారిక వెబ్‌సైట్లను లేదా అధీకృత గ్యాస్‌ ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలని సూచించారు. ఎవరైనా సైబర్‌ నేరగాళ్ల బారిన పడితే ఆలస్యం చేయకుండా హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930ను సంప్రదించాలని.. ఠీఠీఠీ.ఛిడఛ్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీుఽలోనూ ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.

Updated Date - Mar 12 , 2026 | 04:58 AM