Share News

ఫసల్‌ బీమా పథకానికి మంగళం...!

ABN , Publish Date - Aug 27 , 2026 | 10:48 PM

ఆరుగాలం కష్టించి రైతులు పండించిన పంటలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం తెలంగాణ రా ష్ట్రంలో అమలుకు నోచుకోవడం లేదు.

ఫసల్‌ బీమా పథకానికి మంగళం...!

-తెలంగాణలో అమలుగాని పీఎంఎఫ్‌బీవై

-గత ప్రభుత్వ హయాంలో పథకంపై నిర్లక్ష్యం

-రైతు భరోసా అమలుతో ప్రభుత్వం పునరాలోచన

-పంట నష్టం అందించకపోవడంతో తప్పని ఇబ్బందులు

మంచిర్యాల, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టించి రైతులు పండించిన పంటలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం తెలంగాణ రా ష్ట్రంలో అమలుకు నోచుకోవడం లేదు. పీఎంఎఫ్‌బీవైతోపాటు పునర్‌ వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌) 2018- 19 సాగు కాలానికి సంబంధించి అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు కేంద్రం లక్ష్యం వి ధించినప్పటికీ అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రా ష్ట్రంలో పథకం అమలుకు నోచుకోలేదు. పంట బీమా పథకంలో చేరేందుకు రైతులందరూ అర్హులుకాగా, పం ట రుణం పొందే రైతులు పథకంలో తప్పనిసరిగా చే రాలనే నిబంధన ఉండేది. రుణం పొందని రైతులు బ్యాంకుల ద్వారాగానీ, అనుమతి పొందిన మధ్యవర్తి సంస్థల ద్వారా, కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ ద్వారా పథకంలో చేరే వెసులుబాటు కల్పించినప్పటికీ ప్రభుత్వ ని ర్లక్ష్యం కారణంగా రైతులు చేరేందుకు మొగ్గు చూపలేదు.

బీమాతో రైతుకు ధీమా....

ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలకు రైతు లు బీమా చేయించడం వల్ల ఎలాంటి దిగులు లేకుం డా ధీమాగా ఉండవచ్చుననే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభు త్వం పథకానికి శ్రీకారం చుట్టింది. పీఎంఎఫ్‌బీవై పథ కం కింద విత్తనం విత్తినప్పటి నుంచి పంట కోతకు వచ్చే వరకు బీమా అమలుకానుండగా, దిగుబడి నష్టం పై ఆధారపడి బీమా వర్తిస్తుంది. అలాగే ఊహించని ఉపద్రవం సంభవించి ప్రధాన పంటలకు నాట్లు వేయలేకపోవడం, స్థానిక విపత్తులు అయిన పంట నీట మునుగుటు, వడగండ్ల వాన, మట్టి పెళ్లలు విరిగి పడటం, పంట మధ్యకాలంలో, పంట కోతల తర్వాత 14 రోజుల వరకు తుఫాను ప్రభావంతో పంటలకు కలిగే నష్టాలకు బీమా వర్తిస్తుంది. బీమా పథకంలో చేరడం వల్ల ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందుతుంది. ఇదిలా ఉండగా, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌ కింద అధిక లేదా అల్ప వర్షపాతం, రోజువారి ఉష్ణోగ్రత వ్యత్యాసాలు, చీడపీడలు (అ ధిక శాతం గాలిలో తేమ, గరిష్ట ఉష్ణోగ్రతలు), ఈదు రు గాలుల కారణంగా పంట నష్టపోవడం వంటి వైపరీత్యాలకు బీమా వర్తిస్తుంది.

అవగాహన లేమితో....

పంట బీమా చేయించేందుకు అవగాహన లేమితో రైతుల నుంచి పెద్దగా స్పందన లేదనే చెప్పాలి. చివరి సారిగా తెలంగాణ 2018-19 పంట కాలానికి సంబంధించి బీమా పథకం అమలు చేశారు. ఆ సమయంలో జిల్లాలో 2600 హెక్టార్ల వరి పంటకు 2800 మంది రై తులు బీమా తీసుకోగా మొక్క జొన్నకు సంబందించి కేవలం 10 మంది రైతులు మాత్రమే బీమా తీసుకు న్నారు. పంట బీమాకు సంబంధించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. అలాగే ఆనాడు భూముల క్రమబద్దీకరణ కు సంబంధించి ధరణి పోర్టల్‌ బ్యాంకర్లకు అందుబాటులో లేకపోవడం కూడా బీమా తీసుకోకపోవడానికి కారణమని తెలుస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వ యం త్రాంగం సైతం పథకంలో చేరేలా రైతులను ప్రోత్స హించలేదని అభిప్రాయాలు ఉన్నాయి.

మళ్లీ ప్రవేశపెడితే మేలు....!

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు పంట నష్టపోకుండా ఉండేందుకు ఫసల్‌ బీమా అమలు చేస్తామని తెలి పింది. అయితే ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్స రా లు కావొస్తున్నా ఫసల్‌ బీమా పథకం ప్రస్తావన తేవ డం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన విధంగా రాష్ట్రంలో ఫసల్‌ బీమా పథకం అమల్లోకి తెస్తే రైతు లకు మేలు చేసినట్లవుతుంది. రైతులు పథకంలో చేరితే ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటకు నష్టం జరిగిన పక్షంలో ఇన్సూరెన్స్‌ కంపెనీలే ఆ బాధ్యత వహించి, రై తుకు నష్టపరిహారం చెల్లిస్తాయి. తద్వారా పంట నష్టం జరిగినప్పుడల్లా ప్రభుత్వం అందిస్తున్న ఎకరాకు రూ. 10వేల పరిహార భారం కూడా ప్రభుత్వంపై పడదు. పథకాన్ని పున: ప్రవేశపెడితే రైతులకు మేలు జరుగు తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రైతు భరోసా అమలుతో....

కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నదాతల కోసం ’రైతు భరో సా’ పథకం అమలు చేస్తుండటంతో ఫసల్‌ బీమా పథ కం అక్కర్లేదనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం పంటల సాగుకు పె ట్టుబడి సాయం అందిస్తోంది. అలా పథకం కింద రైతులకు సాగు సమయంలో ఇబ్బందులు తప్పి నట్ల వుతోంది. అయితే ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట ప్రకృతి వైపరీత్యానికి కోల్పోతే రైతును ఆదుకొ నేందుకు ఎలాంటి అభయం ఇవ్వడం లేదు. గతంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రై తులకు ఎకరాకు రూ. 10వేల చొప్పున పరిహారం అం దజేసేవారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సైతం పంట నష్టం ఇస్తామని ప్రకటించినప్పటికీ మూడేళ్లుగా అది కార్య రూపం దాల్చడం లేదు. అకాల వర్షాల కారణంగా జ రిగిన నష్టాన్ని అంచనావేసి, ప్రతిపాదనలను వ్యవసా య అధికారులు ప్రభుత్వానికి అందజేస్తున్నా...రైతులకు పరిహారం మాత్రం అందడం లేదు. కనీసం ప్రభుత్వం ప్రకటించిన రూ. 10వేల పరిహారమైనా సకాలంలో అం దజేస్తే రైతులకు కొంతమేర ఉపశమనం లభించి ఉం డేది. పరిహారం ఇవ్వని పక్షంలో ఫసల్‌ బీమా పథకం అమలు చేసినా, రైతులను ఆదుకున్నట్లు అయ్యేది. ఫ సల్‌ బీమా, పరిహారం రెండూ అమలు చేయకపోవ డంతో ప్రకృతి వైపరీత్యాలతో అన్నదాతలు నిలువునా మునుగుతున్నారు. రెండిట్లో ఏదో ఒకటి అమలు చే యాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Updated Date - Aug 27 , 2026 | 10:48 PM