Share News

kumaram bheem asifabad- యాసంగిలో పెరిగిన సాగు

ABN , Publish Date - Jan 29 , 2026 | 11:20 PM

జిల్లాలో ఈ ఏడాది యాసంగి పంటల సాగు పెరిగింది. ఈ సీజనులో సుమారు 50 వేల మూడు వందల ఎకరా ల్లో వివిధ పంటలు సాగులో ఉన్నట్లు వ్యవసాయం శాఖ అఽధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ యాసంగిలో పది వేల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగినట్లు ఆయా మండలాల వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.

kumaram bheem asifabad- యాసంగిలో పెరిగిన సాగు
పవర్‌గూడ గ్రామంలో సాగు చేస్తున్న జొన్న

- చెరువులు, కుంటల్లో సరిపడా నీరు

జైనూర్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ ఏడాది యాసంగి పంటల సాగు పెరిగింది. ఈ సీజనులో సుమారు 50 వేల మూడు వందల ఎకరా ల్లో వివిధ పంటలు సాగులో ఉన్నట్లు వ్యవసాయం శాఖ అఽధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ యాసంగిలో పది వేల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగినట్లు ఆయా మండలాల వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. వరితో పాటు పప్పు ధాన్యాలు, జొన్న, మొక్కజొన్న పంటల సాగు గణనీయంగా పెరిగినట్లు అధికారుల అంచనా. ఈ ఏడాది చివర్లో ఎక్కువ వర్షాలు కురవడంతో చెరువు లు, కుంటల్లో నిండుగా నీరు ఉంది. దీంతో భూగ ర్భ జలాలు పెరగడంతో రైతులు యాసంగి సాగుపై ఉత్సాహం చూపుతున్నారు. వానాకాలం సీజన్‌లో సాగు చేసిన పత్తి దిగుబడి తగ్గింది. దీంతో రైతులు యాసంగిలోనైనా కలిసి వస్తుందనే ఆశతో ఉన్నారు.

- నాలుగు మండలాల్లో వరి అధికం..

జిల్లాలోని కాగజ్‌నగర్‌, పెంచికలపేట, తిర్యాణి, రెబ్బెన మండలాల్లో వరి సాగు విస్తీర్ణం సైతం పెరిగింది. పప్పు ధాన్యాలు, గోధుమలు, మక్క జొన్న, వేరు శనగ, నువ్వులు జొన్న తదితర పంటల సాగు జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌, కెరమెరి మండలాల్లో యాసంగిలో సాగు చేస్తున్న పంటలు వేశారు. ఈ మండలాల్లో కూడ సాగు విస్తీర్ణం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. విత్తనాలు ఎరువుల పంపిణీ కూడా వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణీత కాలంలోనే రైతులకు అందుబా టులో ఉంచారు. వానాకాలంలో దిగుబడి పడిపోయి రైతులు తీవ్రంగా నష్ట పోయారు. దీంతో యాసంగి లోనైన ఆశించిన దిగుబడి దక్కుతుందని అన్నదా తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రతికూ ల పరిస్థితుల్లో ఉత్సాహంగా యాసంగి పంట సాగు చేస్తున్న రైతులు అధికారుల సలహా, సూచ నల కోసం ఎదురు చూస్తున్నారు. వానాకాలం కంటే యాసంగిలో పంటలపై చీడ పురుగుల బెడద అధి కంగానే ఉంటుంది. వాటి నివారణకు రైతులకు అధికారులు పిచికారి చేసే మందుల వాడకంపై అవగాహన కల్పించాలని కోరుతున్నారు. అందిన సమాచారం మేరకు పంటలను పరిశీలించి ఆశించిన దిగుబడికై అధికారులు సూచనలు అందించాలని వేడుకుంటున్నారు.

యాసంగి సాగు పెరిగింది వాస్తవమే..

- ఆనంద్‌రావ్‌, జైనూర్‌ ఇన్‌చార్జి ఏవో

ఈ ఏడాది యాసంగిలో వివిధ పంటల సాగు పెరిగింది. వానాకాలం పంటలు చేతికి అందే సమ యంలో వర్షాలు కురువడంతో రైతులు నష్టపోయా రు. పత్తి పంటకు నష్టం వాటిల్లి దిగుబడి తగ్గింది. దీంతో రైతులు యాసంగి పంటలపై ఆశలు పెంచుకున్నారు. వ్యవసాయ సహాయ విస్తరణ అధి కారుల అంచనాల మేరకు సాగు శాతం గత ఏడాది కంటే పెరిగింది. యాసంగి సాగు కోసం ప్రభుత్వం కల్పించిన సబ్సిడీ మేరకు జొన్నలు, వేరు శనగ విత్తనాలు రైతులకు పంపిణీ చేశాం. రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. సరిపడా ఎరువు లు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుం టాం.

Updated Date - Jan 29 , 2026 | 11:20 PM