Share News

ప్రభుత్వ భూమి సాగు చేయడం నేరం

ABN , Publish Date - Jul 31 , 2026 | 11:50 PM

ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగు చేయడం చట్టరీత్యా నేరమని మెట్‌పల్లి ఆర్డీవో నరసింహారావు హెచ్చరించారు. మండలం లోని మెట్లచిట్టాపూర్‌ గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 498 గల ప్రభుత్వ భూమి ఆక్రమించుకుంటున్నారని గ్రామస్థులు ఇటీవల ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం తహసీల్దార్‌ నీతతో కలిసి

ప్రభుత్వ భూమి సాగు చేయడం నేరం
మెట్లచిట్టాపూర్‌లో వివరాలు సేకరిస్తున్న ఆర్డీవో నరసింహారావు

మెట్‌పల్లి రూరల్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ భూములను ఆక్రమించి సాగు చేయడం చట్టరీత్యా నేరమని మెట్‌పల్లి ఆర్డీవో నరసింహారావు హెచ్చరించారు. మండలం లోని మెట్లచిట్టాపూర్‌ గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 498 గల ప్రభుత్వ భూమి ఆక్రమించుకుంటున్నారని గ్రామస్థులు ఇటీవల ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం తహసీల్దార్‌ నీతతో కలిసి పరిశీలించారు. భూ సర్వే చేసి పత్రాలను పరిశీలించి అదనంగా సాగుచేస్తున్న వారికి నోటీసులు జారీ చేసి భూమి స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆర్డీవో నరసింహారవు మాట్లాడుతూ ప్రభుత్వ భూములపై ఎలాంటి ఆక్రమణలు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. అధికారులు సమగ్ర సర్వే చేసి వాస్తవాలను నిర్ధారించాలని, ఎవరైనా అక్రమంగా సాగు చేస్తున్నట్లు తేలితే సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలన్నారు. భూమికి సంబంధించిన పత్రాలను క్షుణంగా పరిశీలించి అక్రమంగా సాగుచేస్తున్నట్లు తేలితే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ భూములు పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలు అక్రమంగా సాగుచేస్తున్న భూమిని స్వచ్ఛందంగా వదిలేయలన్నారు. పట్టా భూమి ప్రభుత్వ అఽభివృద్ధికి ఇచ్చిన పట్టాదారుడికి ప్రభుత్వం నుంచి వచ్చే భూమి కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్ర మంలో సర్పంచ్‌ సుంకేట అరుణ, గంగాధర్‌, ఆర్‌ఐ సంధ్యరాణి, జీపీవో మల్లేశం, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 11:50 PM