Share News

Chief Secretary Ramakrishna Rao: తెలంగాణ రైజింగ్‌ అమలులో అలసత్వం వద్దు

ABN , Publish Date - Jan 08 , 2026 | 04:05 AM

తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ అమలు విషయంలో అధికారులు అలసత్వం వీడాలని సీఎస్‌ రామకృష్ణారావు సూచించారు. సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో ....

Chief Secretary Ramakrishna Rao: తెలంగాణ రైజింగ్‌ అమలులో అలసత్వం వద్దు

  • నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు: సీఎస్‌ రామకృష్ణారావు

హైదరాబాద్‌, జనవరి 7(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ అమలు విషయంలో అధికారులు అలసత్వం వీడాలని సీఎస్‌ రామకృష్ణారావు సూచించారు. సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపేక్షంచేది లేదని హెచ్చరించారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు రూపొందించిన విజన్‌ డాక్యుమెంట్‌ కాగితాలకే పరిమితం కాకూడదని, ఈ విజన్‌ను సాకారం చేసేందుకు ప్రతి శాఖ సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.4వేల కోట్ల నిధులపై దృష్టి సారించాలని, నెల రోజుల్లోగా నిధులు వచ్చేలా సంబంధిత శాఖలతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. కాగా, అద్దె భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలను ఈ నెల 28వ తేదీలోగా సొంత భవనాల్లోకి మార్చాలని సీఎస్‌ మరో సారి ఆదేశించారు.

Updated Date - Jan 08 , 2026 | 04:05 AM