Share News

కరీంనగర్‌ బస్టాండ్‌లో రద్దీ

ABN , Publish Date - Aug 31 , 2026 | 01:00 AM

రాఖీ పౌర్ణమి అనంతరం తిరుగుముఖం పట్టిన ప్రయాణికులు బస్సుల కోసం అవస్థలు పడ్డారు. 28న రాఖీపౌర్ణమి, అనంతరం శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి కరీంనగర్‌కు చేరుకున్న ప్రయాణికులకు తిరుగుముఖం పట్టారు.

కరీంనగర్‌ బస్టాండ్‌లో రద్దీ
బస్సుల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు

భగత్‌నగర్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రాఖీ పౌర్ణమి అనంతరం తిరుగుముఖం పట్టిన ప్రయాణికులు బస్సుల కోసం అవస్థలు పడ్డారు. 28న రాఖీపౌర్ణమి, అనంతరం శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి కరీంనగర్‌కు చేరుకున్న ప్రయాణికులకు తిరుగుముఖం పట్టారు. కరీంనగర్‌ బస్టాండ్‌లోని వివిధ ఫ్లాట్‌ఫాంలలో ప్రయాణికుల బస్సుల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ఉదయం నుంచే బస్టాండ్‌ ప్రయాణికులతో కిటకిటలాడింది. కరీంనగర్‌ బస్టాండ్‌లోని అన్ని ఫ్లాట్‌ ఫాంల వద్ద వేలాది సంఖ్యలో ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షించారు. హైదరాబాద్‌ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Updated Date - Aug 31 , 2026 | 01:00 AM