Share News

వేములవాడలో రద్దీ

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:19 AM

వేములవాడ రాజన్న ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆయా క్యూలైన్‌ల ద్వారా ఆలయంలోకి చేరుకు న్న భక్తులు శ్రీ భీమేశ్వర స్వామిని

 వేములవాడలో రద్దీ
దర్శనం కోసం క్యూలైన్‌లో బారులు తీరిన భక్తులు

వేములవాడ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజన్న ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆయా క్యూలైన్‌ల ద్వారా ఆలయంలోకి చేరుకు న్న భక్తులు శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని తరించారు. అనంతరం భీమన్నకు కోడెమొక్కు చెల్లించుకున్న భక్తులు గాయత్రీమాత ఆలయంలో కుంకుమ పూజలో పాల్గొని తరించారు. ఆలయా నికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భీమన్న ఆలయానికి వచ్చిన గుంగుల కమలాకర్‌కు ఆలయ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీస్వామి వారి ప్రత్యేక పూజలో పాల్గొన్న అనంతరం ఆలయ మండపంలో అర్చకులు ఆశీర్వచనం గావించగా ఆలయ డిప్యూటీ ఈవో రాజన్న ప్రసాదం అందించారు.

Updated Date - Jun 18 , 2026 | 12:19 AM