Share News

వేములవాడలో భక్తుల రద్దీ

ABN , Publish Date - Apr 21 , 2026 | 01:08 AM

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కోడెమొక్కు చెల్లించుకునేందుకు సుమారుగా మూడు గంటలపాటు నిరీక్షిం చారుధర్మదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్‌ల ద్వారా భక్తులు ఆలయంలోకి

వేములవాడలో భక్తుల రద్దీ
భీమన్నకు కోడెమొక్కు చెల్లించుకుంటున్న సినీనటి పూనమ్‌ కౌర్‌

వేములవాడ, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కోడెమొక్కు చెల్లించుకునేందుకు సుమారుగా మూడు గంటలపాటు నిరీక్షిం చారుధర్మదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్‌ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకుని శ్రీ భీమేశ్వర స్వామి అభిషేకపూజలో పాల్గొన్నారు. శివకళ్యాణం, కుంకుమ పూజలో పాల్గొని చివరిగా శ్రీ బద్ది పోచమ్మ, శ్రీనగరేశ్వర స్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. శ్రీభీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్‌ కౌర్‌ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వేములవాడకు విచ్చేసిన ఆమె ముందుగా శ్రీస్వామి వారి అభిషేక పూజలో పాల్గొని, కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఆలయ మండపంలో అర్చకులు ఆశీర్వచనం గావించి రాజన్న ప్రసాదాన్ని అందజేశారు. వారి వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రపంచ దేశాల్లో శాంతి నెలకొనాలని స్వామివారిని వేడుకున్నట్లు సినీనటి పూనమ్‌ కౌర్‌ తెలిపారు. ఎంతో మంది పెద్ద వాళ్లు వేములవాడ వెళ్లి దర్శనం చేసుకోవాలని తనకు చెప్పారని, ఆలయ అభివృద్ధి పూర్తి అయిన తరువాత స్వామివారి దర్శనానికి వస్తానని చెప్పారు.

Updated Date - Apr 21 , 2026 | 01:08 AM