ఆరుతడి పంటలు సాగు చేయాలి
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:48 PM
పంట మార్పిడితో మంచి దిగుబడులు వస్తాయని, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఆరుతడి పంటలనే సాగు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలోని రైతు గుర్రాల వినోద- సత్తిరెడ్డి దంపతులు 1.20 ఎకరాల్లో సాగు చేసిన ఆరుతడి పంటలను మంగళవారం ఆమె పరిశీలించారు. పంటల సాగు విధానాలను
ఎల్లారెడ్డిపేట, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): పంట మార్పిడితో మంచి దిగుబడులు వస్తాయని, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఆరుతడి పంటలనే సాగు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలోని రైతు గుర్రాల వినోద- సత్తిరెడ్డి దంపతులు 1.20 ఎకరాల్లో సాగు చేసిన ఆరుతడి పంటలను మంగళవారం ఆమె పరిశీలించారు. పంటల సాగు విధానాలను అడిగి తెలుసుకున్నారు. తక్కువ నీటితో ఆరుతడి పంటలను వేయడం వల్ల వరి పంట కంటే అధనంగా లాభాలను ఆర్జిస్తున్నామని రైతు దంపతులు వినోద- సత్తిరెడ్డిలు పేర్కొన్నారు. నెలకు రూ.50 వేల ఆదాయం పొందుతున్నామని వివరించారు. గ్రామాల్లోని రైతులు వినోద- సత్తిరెడ్డి దంపతులను ఆదర్శంగా తీసుకుని ఆరుతడి పంటలను సాగు చేయాలని అన్నారు. అనంతరం వినోద- సత్తిరెడ్డి దంపతులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ అభినందించారు. అంతకు ముందు కలెక్టర్‌కు సర్పంచ్ రమేశ్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, తహసీల్దార్ దివ్యజ్యోతి, ఎంపీడీవో సత్తయ్య, ఏవో రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తదితరులు ఉన్నారు.