Share News

kumaram bheem asifabad-అడవి పందుల నుంచి పంటలను కాపాడుకోవాలి

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:38 PM

డవి పందుల బారి నుంచి పంటను రక్షించుకోవడానికి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే కొంత ఉపయోగం ఉంటుందని ఏఈవో తిరుపతి అన్నారు. మండలంలోని పర్సనంబాల, అడ్డాఘాట్‌, రౌటసంకెపల్లి గ్రామాల్లో అడవిపందులు పంటపై దాడి చేస్తున్న ప్రాంతాన్ని శుక్రవారం పరిశీలించి పంట నష్టపోతున్న రైతులకు అవగాహన కల్పించారు.

kumaram bheem asifabad-అడవి పందుల నుంచి పంటలను కాపాడుకోవాలి
మాట్లాడుతున్న ఏఈవో తిరుపతి

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకోవడానికి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే కొంత ఉపయోగం ఉంటుందని ఏఈవో తిరుపతి అన్నారు. మండలంలోని పర్సనంబాల, అడ్డాఘాట్‌, రౌటసంకెపల్లి గ్రామాల్లో అడవిపందులు పంటపై దాడి చేస్తున్న ప్రాంతాన్ని శుక్రవారం పరిశీలించి పంట నష్టపోతున్న రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పంట 75 నుంచి 90 రోజులకు వచ్చిందన్నారు. పంటలను పందుల దాడి నుండి కాపాడుకోవడానికి చేను చుట్టూ తలవెంట్రుకలు ఉంచుట, తాటాకు శబ్దాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల పంట చేలలోకి రావని చెప్పారు. రాత్రి వేళల్లో చేల పరిసరాల్లో దీపపు బుడ్డిలను ఏర్పాటు చేసుకోవడం కూడా మేలన్నారు.గాజు సీసాలలో సీసపు గోలీలు వేసి వేలాడ దీయడం వల్ల గాలికి అవి చేసే చప్పుడుకు అడవి పందులు బెదిరిపోతాయని తెలిపారు. సోలర్‌ కంచె ఏర్పాటు చేసుకొనుట, చేను చుట్టూ చీరలను కట్టుట, బ్రో మాడయలన్‌ వంటి రసాయినిక మందు పూతపూసిన దారాన్ని కంచెగా ఏర్పాటు చేసుకోవడం వంటి సహజసిద్ధమైన విధానాలను అవలంబించడం ద్వారా పంటకు రక్షణ లబిస్తుందన్నారు. అడవి పందులకు ఎలాంటి హానీ కలిగించకుండా వాటి నుంచి పంటను రక్షించుకోవడానికి సహజసిద్ధమైన మార్గాలను ఎంచుకోవాలన్నారు. అలాగే రైతులు పంటల వివరాలను డిజిటల్‌ క్రాప్‌ సర్వే విధానం ద్వారా తప్పని సరిగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

Updated Date - Sep 11 , 2026 | 11:38 PM