కరెంటు రాక పంటలు ఎండిపోతున్నాయి
ABN , Publish Date - Sep 13 , 2026 | 11:38 PM
తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపో తున్నాయని తాండ్రా మాజీ స ర్పంచ్ బొల్లెసుశీల ఆవేదన వ్య క్తం చేశారు.
- మాజీ సర్పంచ్ బొల్లె సుశీల
కల్వకుర్తి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపో తున్నాయని తాండ్రా మాజీ స ర్పంచ్ బొల్లెసుశీల ఆవేదన వ్య క్తం చేశారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జైపా ల్‌యాదవ్ నివాసంలో రైతులతో కలిసి ఆమె విలేకర్లతో మాట్లాడారు. వ్యవసా యానికి నాణ్యమైన 24గంటల విద్యుత్ సరఫ రా చేయాలని డిమాండ్ చేశారు. కల్వకుర్తి మండలం తాండ్రా సమీపంలోని జాతీయ రహ దారిపై 24గంటలు విద్యుత్ సరఫరా చేయాలని రైతులు గత శుక్రవారం ధర్నా నిర్వహిస్తే గ్రా మ సర్పంచ్ కాయితీ ఆశాదీప్‌రెడ్డి రైతులను తాగుబోతులు, గాడిదలతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారని సుశీల ఆరోపించారు. రైతులను అవ మానించేలా మాట్లాడడం సరికాదని, సమస్య లు పరిష్కరిం చాల్సిన బాధ్యత ప్రజాప్రతిని ధులపై ఉందన్నారు.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
రైతులను తాగుబోతులు, గాడిదలతో పోలు స్తూ విమర్శించిన తాండ్రా సర్పంచ్ కాయితీ ఆశాదీప్‌రెడ్డిపై గ్రామానికి చెందిన రైతులు మై బుయాదవ్, యాకుబ్‌లతో కలిసి పోలీస్ స్టేష న్‌లో ఫిర్యాదు చేసినట్లు సుశీల తెలిపారు. రైతు ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్య లు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు ఆమె తెలిపారు. విలేకర్ల సమావేశంలో బీఆర్‌ఎస్ నా యకులు ఈశ్వర్, కిశోర్, నరేష్ పాల్గొన్నారు.