kumaram bheem asifabad- పంట మార్పిడి..మేలైన దిగుబడి..
ABN , Publish Date - Jun 13 , 2026 | 11:29 PM
వానాకాలం సాగు సీజన్ మొదలైంది. కొద్ది రోజుల్లో రుతుపవనా లు జిల్లాను తాకనున్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వానాకాలంలో పంట మార్పిడి చేపట్టాలని రైతు సంక్షేమ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీంతో పంట మార్పిడిపై జిల్లా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒకే రకమైన పంటను ఏళ్ల తరబడి సాగు చేయడం వల్ల దిగుబడి రాక అనేక సమస్యలు ఎదురవుతాయని, చీడపీడలు బెడద అధికం కావడంతో పాటు భూమి సారం కోల్పోతుందని, పంట మార్పిడితో ప్రయోజనం ఉం టుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు
- రైతులకు అధికారుల సూచన
బెజ్జూరు, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సాగు సీజన్ మొదలైంది. కొద్ది రోజుల్లో రుతుపవనా లు జిల్లాను తాకనున్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వానాకాలంలో పంట మార్పిడి చేపట్టాలని రైతు సంక్షేమ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీంతో పంట మార్పిడిపై జిల్లా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒకే రకమైన పంటను ఏళ్ల తరబడి సాగు చేయడం వల్ల దిగుబడి రాక అనేక సమస్యలు ఎదురవుతాయని, చీడపీడలు బెడద అధికం కావడంతో పాటు భూమి సారం కోల్పోతుందని, పంట మార్పిడితో ప్రయోజనం ఉం టుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జిల్లాలో అన్ని రకాల పంటల సాగుకు నేలలు అనుకూలంగా ఉన్నప్పటికీ రైతులు గత కొన్నేళ్లుగా పత్తి, వరి పంటలే సాగు చేస్తున్నారు. చీడపీడల ఉదృతి పెరగడంతో విపరీతంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారి చేస్తు న్నారు. దీంతో భూమి సారవంతం కోల్పోయి పంట ఎదుగుదల క్షీణించి దిగుబడి తగ్గి నష్టపోతున్నారు. వానాకాలంలో 70శాతం రైతులు వర్షాధారంగా ఈ రెండు పంటలే సాగు చేస్తున్నారు. కొందరు అటవీ జంతువుల బెడద ఉంటుందని, మార్కెట్, నీటి సౌకర్యం లేదని, వేరే పంటలు దిగుబడి రావని తదితర కారణాలతో ఇతర పంటల వైపు మొగ్గు చూపడం లేదు.
- చీడపీడల నివారణకు..
కొన్ని రకాల పురుగులు, తెగుళ్లు కొన్ని పంటలను అధికంగా ఆశించి వృద్ధి చెందుతాయి. అలాంటి పం టలను వరుసగా వేసుకోకుండా మార్పిడి చేసుకో వాలి. వరుసగా పత్తి, వరి పంట వేయకుండా పప్పుధాన్యపు పంటలు, నూనె గింజల పంటలు వేసుకోవాలి. మిరప, వేరుశనగ, క్యాబేజీ పంటలను లద్దె పురుగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తాయి. వీటి ఉదృతిని అరికట్టేందుకు జొన్న, వరి, సజ్జ, రాగి, పొద్దు తిరుగుడు వంటి అరుతడి పంటలతో మా ర్పిడి చేసుకోవాలి. దీనివల్ల ఆయా పంటల్లో తెగు లు, నులిపురుగులు, ఆకు ముడత వంటి రోగాలను దూరం చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
- భిన్నమైనవి ఎంచుకోవాలి..
పంట మార్పిడి చేయాలంటే అంతకుముందు వేసిన పంటకు భిన్నంగా పెరిగే పంటను ఎంచు కోవాలి. నువ్వులు, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న పంటల వేరు వ్యవస్థలు భూమి నుంచి పోషకాలు ఎక్కువగా గ్రహిస్తాయి. పంట మార్పిడి చేసే రైతు లు భూమి నుంచి పోషకాలను గ్రహించే ఈ పంట లకు బదులు భూమికే పోషకాలు అందించే పంట లు వేసుకుంటే దిగుబడులు వస్తాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
భూసారం పెరుగుతుంది..
- నాగరాజు, ఏవో, బెజ్జూరు
పంట మార్పిడితో భూసారం పెరుగుతుంది. ఈ విధానం వల్ల అధిక దిగుబడులు కూడా సాధిం చవచ్చు. అరుతడి పంట భూముల్లో మొక్కజొన్ననే కాకుండా నువ్వులు, కందులు, మినుము సాగు చేస్తే రసాయన ఎరువుల అవసరం ఉండదు. వానా కాలంలో వేసిన పంటను యాసంగిలో మార్పిడి చేస్తే లాభం చేకూరుతుంది. రైతులు తప్పనిసరిగా ఏటా పంట మార్పిడి విధానాన్ని అమలు చేయాలి. ఇందుకోసం రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అధికారులు సూచనలు రైతులు పాటిస్తే ప్రయోజనం ఉంటుంది.