Share News

పంటరుణం.. పరిమితం

ABN , Publish Date - Jun 03 , 2026 | 11:05 PM

రాష్ట్రస్థాయి సాం కేతిక బ్యాంకర్ల కమిటి (ఎస్‌ఎల్‌టీసీ) తాజాగా ప్రక టించిన రుణ పరిమితిపై రైతులు పెదవి విరుస్తున్నా రు. గత సంవత్సరంతో పోలిస్తే రుణ పరిమతి పెంపు తక్కువగా ఉందని రైతులు వాపోతున్నారు.

పంటరుణం.. పరిమితం
నెన్నెల గ్రామీణ బ్యాంకు గేటు వద్ద పంట రుణాల కోసం ఎగబడుతున్న రైతులు

-అంతంత మాత్రంగా పెరిగిన రుణపరిమితి

-పంట పెట్టుబడికి తగ్గ అప్పు ఇవ్వని బ్యాంకులు

-రుణం కోసం బ్యాంకుల చుట్టూ చక్కర్లు

-రోజుకు 25 నుంచి 30 మందికే....

-కౌలు రైతుకు అందని రుణసాయం

నెన్నెల, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రస్థాయి సాం కేతిక బ్యాంకర్ల కమిటి (ఎస్‌ఎల్‌టీసీ) తాజాగా ప్రక టించిన రుణ పరిమితిపై రైతులు పెదవి విరుస్తున్నా రు. గత సంవత్సరంతో పోలిస్తే రుణ పరిమతి పెంపు తక్కువగా ఉందని రైతులు వాపోతున్నారు. పెట్టుబ డులు పెరిగినప్పటికి కొన్ని పంటలకు రుణ పరమి తిని అంతంత మాత్రంగానే పెంచడంతో వ్యవసాయ రంగానికి పెట్టుబడుల కొరత తీవ్రం కానుంది. రుణ పరిమితి ఆశించిన మేర పెరగకపోగా, రైతుల అవస రాల మేరకు బ్యాంకర్ల రుణ ప్రణాళిక ఉండటం లేదు. దీంతో వ్యవసాయ రంగంలో వడ్డీ వ్యాపారులు, దళారు ల వ్యవస్థ పెరిగిపోతోంది. మరోవైపు పంట రుణాల కో సం రైతులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. రోజుకో గ్రామానికి చెందిన 25 నుంచి 30 మంది రైతులకు మాత్రమే రుణాలు ఇస్తున్నారు. రుణా ల జారీ మందకోడిగా సాగుతుండటంతో రుణాల చె ల్లింపు గడువు దాటి రెన్యూవల్‌ చేసుకునేవారిపై అధిక వడ్డీ భారం పడుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి రైతుల నుంచి రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు వివిధ చార్జీల పేరిట అదనంగా వసూలు చేస్తున్నారు. పెరిగిన ధరల దృష్ట్య పెట్టుబడులకు అను గుణంగా రుణాలు ఇవ్వడంతో పాటు రుణాలు అంద జేయడంలో వేగం పెంచాలని రైతులు కోరుతున్నారు.

-సర్వర్‌ వెరీ స్లో...

బ్యాంకులో పంట రుణం తీసుకున్న తేదీ నుంచి ఏడాదిలోపు వడ్డీ సహా తిరిగి చెల్లిస్తే రూ. లక్ష వరకు రుణానికి సున్నా వడ్డీ, రూ లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు పావలా వడ్డీ వర్తింపజేయాల్సి ఉంటుంది. వ్య వసాయ రుణాలకు 7 శాతం వడ్డీ ఉండగా, 3 శాతం కేంద్రం, 4 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాయి. పంట రుణాల కోసం గ్రామాల వారిగా రోజువారి షెడ్యూల్‌ పెట్టడంతో కొందరు రైతులు రుణాలు చెల్లించి తీసుకు నే గడవు దాటిపోతోంది. దీంతో వారం పది రోజుల్లోనే వడ్డీ రెట్టింపు అవుతోంది. వర్షాలు కురిస్తే సమయం దొరకదని భావిస్తున్న రైతులు రుణాల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎండకు ఎండుతూ గేటు వద్దే ఎప్పుడు త మను పిలుస్తారా అంటూ ఎదురు చేస్తున్నారు. గ్రామీ ణ బ్యాంకుల్లో కొత్తగా వచ్చిన సాఫ్ట్‌వేర్‌తో పాటు స ర్వర్‌ సమస్యలతో రోజుకు 30 మంది కంటే ఎక్కువ లోన్లు ఇవ్వలేక పోతున్నామని బ్యాంకు అధికారులు అంటున్నారు. గతంలోలా కాకుండా డ్యాకుమెంటేషన్‌ మొత్తం ప్రింట్‌ తీసి సంతకాలు తీసుకుంటుండటంతో ఒక్కో రైతుకు చాలా సమయం పడుతోంది.

-లక్ష్యానికి తక్కువే..

మంచిర్యాల జిల్లాలో 3.33 లక్షల భూమిని 1.52 లక్షల మంది రైతులు వివిద రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఎక్కువగా సాగయ్య పత్తి, వరి పంటలకు ఇతర పంటల కంటే ఎక్కువే పెట్టుబడి అవుతుంది. జిల్లా సాగు విస్తీర్ణం, పంట సాగు విధానాన్ని బట్టి ప్ర భుత్వం రుణ ప్రణాలికను ఖరారు చేసింది. కానీ తమ అవసరాల మేరకు రుణప్రణాలిక ఉండటం లేదని రై తులు వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఆశించిన మేర బ్యాంకర్లు రుణాలు అందించడం లేదు. పంటలకే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలకు సైతం రు ణాలు ఇచ్చి ప్రొత్సహించాల్సి ఉన్నప్పటికి ఆ దిశగా అడుగులు పడటం లేదు. లక్ష్యం భారీగా పెట్టుకుంటు న్నప్పటికి పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు వెను కబడుతున్నాయి. బ్యాంకర్లు కుంటిసాకులతో ప్రభుత్వం నిర్థేశించిన లక్ష్యం కంటే 20 శాతం తక్కువ రుణాలు అందజేస్తున్నారు.

-కౌలురైతులకు మొండిచెయ్యి

జిల్లాలో దాదాపు 20 వేల మంది కౌలు రైతులు న్నారు. సొంతంగా సాగుభూమి లేకపోవడంతో పట్టాదా రుల నుంచి భూమి కౌలుకు తీసుకుని వివిధ పంటలు పండిస్తున్నారు. అలాంటి కౌలు రైతులకు రుణాలు ఇ వ్వడానికి బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. ప్రైవేటు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి సాగు చేసి నష్టపోతే పరిహారం కౌలు రైతుకు బదులు భూయజమానికి వ స్తోంది. పంటనష్ట పోవడం, కౌలు ముందే చెల్లించి ఉం డటం, పరిహారం పట్టాదారుకే ఇస్తుండటంతో కౌలు రై తు పలు విధాలుగా నష్టపోవాల్సి వస్తోంది. 2011లో కౌలు రైతుల కోసం రూపొందిచిన చట్టం సైతం వారిని ఆదుకోవడం లేదు. కౌలు రైతులను గుర్తించి వారికి రుణ అర్హత కార్డు ఇవ్వాల్సి ఉండగా... అలాంటి దాఖ లాలు జిల్లాలో ఎక్కడా కానరావడం లేదు. బ్యాంకు రుణం పొందాలంటే కౌలురైతులకు భూయజమాని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంది. హామిపత్రం ఇస్తే ఎం జరుగుతుందో అనే భయంతో కౌలు రైతులకు పట్టే దార్లు హామీ పత్రం ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నా రు. ఫలితంగా కౌలురైతులు పెట్టుబడుల కోసం పడరా ని పాట్లు పడుతున్నారు. అధికారులు, బ్యాంకుల చుట్టు తిరిగినా పంట రుణం అందడం లేదు. సాగు పెట్టుబ డుల కోసం అధిక వడ్డీకి ప్రైవేటు అప్పులు చేస్తున్నారు.

Updated Date - Jun 03 , 2026 | 11:05 PM