kumaram bheem asifabad- కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలి
ABN , Publish Date - Oct 31 , 2026 | 11:20 PM
గుండి వంతెన నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంలేదంటు ప్రభుత్వంపై ఎమ్మెల్యే కోవ లక్ష్మి విమర్శలు చేయడం మానుకోవాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. స్థానికంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గుండి వంతెన నిర్మాణానికి బీజం పడిందే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనని చెప్పారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): గుండి వంతెన నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంలేదంటు ప్రభుత్వంపై ఎమ్మెల్యే కోవ లక్ష్మి విమర్శలు చేయడం మానుకోవాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. స్థానికంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గుండి వంతెన నిర్మాణానికి బీజం పడిందే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనని చెప్పారు. బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంబించింది కాంగ్రెస్ పాలనలోనే అని తెలిపారు. తెలంగాణ ఉద్యమం నిర్మాణ దశలలో అప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఏపీకి చెందిన కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే నిలిపివేసి వెళ్లిపోయారని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు పాలించినప్పటికీ వంతెన నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. గత పదేళ్ల పాలనలో చేయలేని పనులపై సమాధానం చెప్పకుండా ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేయడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శమని తెలిపారు. సమావేశంలో జైనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్‌రావ్, నాయకులు రాపర్తి మురళీ, ఇమ్రాన్, సుజాహిత్‌ఖాన్, రమేష్, కిషన్‌గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.