kumaram bheem asifabad-నిందితులకు శిక్ష పడినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యం
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:11 PM
కోర్టు కేసుల్లో నిందితులకు శిక్షలు పడినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ఎస్పీ నితికా పంత్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): కోర్టు కేసుల్లో నిందితులకు శిక్షలు పడినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని ఎస్పీ నితికా పంత్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిందితులకు శిక్ష పడడానికి కేసులు పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలని అన్నారు. కోర్టు కానిస్టేబుల బాధ్యత చాలా కీలకమని, ఎఫ్‌ఐఆర్ నమోదు అయినప్పటికీ నుంచి కేసు పూర్తయేంత వరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసర మైన అన్ని రుజువులు, ప్రతాలు, సాక్షుల వాగ్మూలంను కోర్టుకు సమర్పించడంలో కోర్టు డ్యూటీ అదికారుల వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలన్నారు. సాక్షులను, బాధితులను సమయానికి కోర్టులో హాజరు పరిచేలా చూసుకోవాలని, బాధితులకు, సాక్షులకు కేసుకు సంబంధించిన విషయాలలో అవగాహన కల్పించాలని చెప్పారు. సాక్షుల భద్రతకు న్యాయవ్యవస్థ అండగా ఉంటుందని వివరించారు. కోర్టు సమాచారం ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ఎస్‌హెచ్ వోలకు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల పరిష్కారానికి సంబంధించిన పలువురు కోర్టు కానిస్టేబుళ్లను అడిగి కేసుల పురోగతిపై సూచనలు చేశారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు, నాన్ బెయిలబుల వారెంట్స్(ఎన్‌బీ డబ్లూ), సమన్స్ సమీక్షించి త్వరగా నాన్ బెయిలబుల్ వారెంట్స్ కోర్టులో హాజరు పరిచి ఎన్‌బీడబ్ల్యూకు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో సీఐ శ్రీధర్, సతీష్, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.