Share News

రేపటి నుంచి క్రెడాయ్‌ ప్రాపర్టీ షో

ABN , Publish Date - Feb 05 , 2026 | 03:56 AM

క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రాపర్టీ షో శుక్రవారం నుంచి మూడురోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో వందకు పైగా స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

రేపటి నుంచి క్రెడాయ్‌ ప్రాపర్టీ షో

  • హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో నిర్వహణ

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రాపర్టీ షో శుక్రవారం నుంచి మూడురోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో వందకు పైగా స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అనుమతులతోపాటు రెరా ఆమోదించిన ప్రాజెక్టులను మాత్రమే ప్రదర్శించాలని ఇప్పటికే క్రెడాయ్‌ హైదరాబాద్‌ నిబంధన విధించింది. ఈ ఏడాది మొదటి దశలో నిర్వహిస్తున్న ఈ ప్రాపర్టీ షోను ‘పర్మనెంట్‌ హో జావో’ అనే సందేశంతో చేపడుతున్నారు. ఈ సందర్భంగా క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు ఎన్‌.జైదీప్‌ రెడ్డి, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ బి.జగన్నాథ్‌రావులు మాట్లాడుతూ.. సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునేవారికి ఇదే సరైన సమయమన్నారు. హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్‌ ప్రాజెక్టులు, విల్లాలు, ప్లాట్లు, ఆఫీసు స్పెస్‌ల ప్రద ర్శన ఉంటుందని తెలిపారు.

Updated Date - Feb 05 , 2026 | 03:56 AM