తెగుళ్ల నివారణపై రైతులకు అవగాహన
ABN , Publish Date - Sep 23 , 2026 | 11:28 PM
వివిధ పంటలకు ఆశించిన తెగుళ్ళ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, యాజమాన్య పద్ధతులపై కేవీకే ఇన్‌చార్జి కోఆర్డినేటర్ డాక్టర్ ఒంగోలు శైల రైతుల కు అవగాహన కల్పించారు.
బిజినేపల్లి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యో తి) : వివిధ పంటలకు ఆశించిన తెగుళ్ళ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, యాజమాన్య పద్ధతులపై కేవీకే ఇన్‌చార్జి కోఆర్డినేటర్ డాక్టర్ ఒంగోలు శైల రైతుల కు అవగాహన కల్పించారు. మండలం లోని సల్కర్‌పేటలో బుధవారం పత్తిలో తెగుళ్ల నివారణపై రైతులకు క్షేత్రస్థాయి లో శిక్షణ చేపట్టి మాట్లాడారు. ప్రస్తుతం పత్తి కాయపగిలే దశలో ఉండగా అక్కడ క్కడా ఆకులు ఎర్రబడడం గమనించి ఇప్పుడు న్న వాతావరణ పరిస్థితుల దృష్యా మెగ్నీషి యం లోపం గుర్తించి తగు మోతాదులో సల్ఫే ట్‌ను పిచికారి చేయాలని సూచించారు. వివిధ పంటల సాగులో తీసుకోవాల్సిన సమగ్ర యాజ మాన్య పద్ధతులను రైతులకు వివరించారు. కార్యక్ర మంలో సర్పంచ్ అబ్బరాములు, ఏఈవో గోవిందు మధు, 29 మంది రైతులు ఉన్నారు.