మార్నింగ్ వాక్‌లో పాములపై అవగాహన
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:19 PM
వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా అచ్చంపేట ప ట్టణంలోని ఎన్‌టీఆర్ స్టే డియంలో ఆదివారం వా కర్స్‌క్లబ్ సభ్యులకు పా ముల సంరక్షణ, రక్షణ పై అవగాహన కార్యక్ర మం నిర్వహించారు.
అచ్చంపేట, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా అచ్చంపేట ప ట్టణంలోని ఎన్‌టీఆర్ స్టే డియంలో ఆదివారం వా కర్స్‌క్లబ్ సభ్యులకు పా ముల సంరక్షణ, రక్షణ పై అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ప్ర జల్లో వన్య ప్రాణుల పట్ల అవగాహన పెంపొందిం చడం, పాముల పట్ల ఉ న్న అపోహలు తొలగిం చడం, పాములు-మనుషుల మధ్య సురక్షిత సహజీవనాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్ర మం ముఖ్య ఉద్దేశమని స్నేక్ క్యాచర్ సుమన్, జూనియర్ అసిస్టెంట్ హనుమంతు అన్నారు. మాట్లాడుతూ పాములు వివిధ జాతులు, వాటి గుర్తింపు, విషపూరిత, విషరహిత పాముల మధ్య తేడాలు, పాముల ప్రవర్తన, వాటి నివాస ప్రాంతాలు తదితర అంశాలను వివరించారు. పాములు పర్యావరణ సమతుల్యతలో పో షించే కీలక పాత్రను వివరించడంతో పాటు ఎ లుకలు, ఇతర హానికర జీవుల నియంత్రణలో పాముల ప్రాధాన్యతను తెలియజేశారు. వాకర్స్ క్లబ్ సభ్యులు కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొని పాములకు సంబంధించిన పలు సందే హాలను అడిగి తెలుసుకున్నారు. పాముల సంర క్షణ, వన్యప్రాణుల రక్షణ, ప్రకృతితో సహజీ వ నం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెం పొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరిం త విస్తృతంగా నిర్వహించాల్సినవసరం ఉందని నిర్వాహకులు తెలిపారు. వన్యప్రాణి వారోత్సవా లు- 2026 సంరద్భంగా ప్రజల్లో ప్రకృతి, వన్య ప్రాణులు, జీవ వైవిధ్య పరిరక్షణపై అవగాహన పెంపొం దించేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో వివిధ అవగాహన కార్యక్రమాలు కొనసాగు తా యని జిల్లా అటవీశాఖ అధికార రేవంత్‌చంద్ర తెలిపారు.