రైస్ మిల్లర్లపై కొరడా...!
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:36 PM
సీఎమ్మార్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కోసం వరి ధాన్యం తీసుకొని, తిరిగి ఇవ్వని రైస్ మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం కొరఢా ఝళిపిస్తోంది.
జిల్లాలో తొలి పీడీ యాక్టు కేసు నమోదు
సీఎంఆర్ ఇవ్వకపోవడంతో పోలీసుల చర్యలు
మరికొందరు డిఫాల్టర్లపైనా చర్యలకు సన్నాహాలు
క్వింటాలుకు 67 కిలోల బియ్యం సాధ్యంకాదంటున్న మిల్లర్లు
మంచిర్యాల, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): సీఎమ్మార్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కోసం వరి ధాన్యం తీసుకొని, తిరిగి ఇవ్వని రైస్ మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం కొరఢా ఝళిపిస్తోంది. సీఎంఆర్ పెండింగ్ విషయమై ఇటీవల రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ, ఎట్టి పరిస్థితుల్లో బకాయిలను వసూలు చే యాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిం దే. మంత్రి ఆదేశాలు జారీ చేయడంతో అప్రమత్తమైన అధికారులు డిఫాల్టర్లయిన మిల్లర్లపై చర్యలకు ఉపక్ర మిస్తున్నారు. ఇందులో భాగంగా డిఫాల్టర్‌గా ఉన్న గం ప సంతోష్‌కుమార్ అనే రైస్ మిల్లర్‌పై పోలీసులు తొ లిసారిగా పీడీయాక్ట్ నమోదు చేశారు. మరికొందరు డిఫాల్టర్లపైనా పీడీ యాక్టు ప్రయోగించేందుకు కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్ర భుత్వం అందజేసిన వరి ధాన్యాన్ని మరాడించి బియ్యం గా మార్చి తిరిగి అప్పగించడంలో రైస్ మిల్లర్లు తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారనే భావనలో ప్రభుత్వం ఉంది.
ప్రభుత్వ ఆదేశాలతో...
సీఎమ్మార్ ఇవ్వని మిల్లర్లపై కఠిన చర్యలు తీసు కోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో యంత్రాంగం కదులు తోంది. ప్రతి యేటా రబీ, ఖరీఫ్ సీజన్లకు సంబంధించి కచ్చితంగా మిల్లర్ల నుంచి బియ్యం తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నుంచి జిల్లా అధికారులకు ఆదే శాలున్నాయి. చాలా మంది మిల్లర్లు పలు కారణాలు చెబుతూ దాటవేసే ప్రయత్నం చేస్తుండటంతో అధికా రులు ప్రత్యక్ష చర్యలకు పూనుకుంటున్నారు. గతంలో సీఎమ్మార్ కింద ధాన్యం పొందిన మిల్లర్లు పెద్ద మొ త్తంలో వాటిని పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఎ దుర్కొంటున్న మిల్లర్లపై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జిల్లాలో మొత్తం 54 రైస్ మిల్లులు ఉండగా, వాటిలో బాయిల్డ్-19, రా రైస్ మిల్లులు 35 ఉన్నాయి. వాటిలో సీఎంఆర్ అనుమతులు 32 మిల్లులకు ఉన్నాయి. గతంలో సీఎంఆర్ పెండింగ్ ఉ న్నాయంటూ వాటిలో సింహభాగం మిల్లులకు మొన్న టి యాసంగి సీజన్‌లో జియో ట్యాగింగ్ కూడా ఇవ్వలేదు.
తొలి పీడీ యాక్ట్ నమోదు...!
జిల్లాలో గతంలో జిల్లా వ్యాప్తంగా సీఎమ్మార్ ఇవ్వ ని 25 మిల్లులపై అధికారులు కేసులు నమోదు చేశా రు. అంతేగాక 25 శాతం అపరాద రుసుం, 12 శాతం వడ్డీ కూడా వసూలుకు పూనుకున్నారు. దీంతో ధాన్యం విలువకు వడ్డీతో సహా లెక్కలు గట్టి వసూలు చేస్తు న్నారు. అయినప్పటికీ చాలా మంది మిల్లర్లు మొండి కేస్తుండటంతో వారి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న స్థి రాస్థులను సైతం జప్తు చేసే అంశాలను పరిశీలిస్తు న్నారు. ఈ విషయమై ఇప్పటికే పలువురు మిల్లర్లకు నోటీసులు కూడా జారీ అయినట్లు తెలుస్తోంది. అ యినా స్పందన లేకపోవడంతో పీడీ యాక్టు అమలుకు పూనుకుంటున్నారు. తాజాగా దండేపల్లి మండలం లింగాపూర్‌లోని రామలక్ష్మణ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ పా ర్టనర్ గంప సంతోష్‌కుమార్‌పై తొలిసారిగా పోలీసులు పీడీ యాక్టు అమలు చేశారు. ప్రభుత్వానికి అందించా ల్సిన సీఎమ్మార్‌ను అక్రమంగా దారి మళ్లించి, బ్లాక్ మార్కెట్లో విక్రయించి ఆర్థిక లాభాలు పొందారన్న కేసులో ఆయనపై పోలీసు కేసులు నమోదుకాగా ప్ర స్తుతం లక్షెట్టిపేట సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతనిపై రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆ దేశాల మేరకు పీడీ యాక్టు నమోదు చేసిన పోలీసు లు శుక్రవారం జైలులో ఉన్న అతనికి ఉత్తర్వులను అందించిన అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. సంతోష్‌కుమార్ 2022-23, 2024-25 రబీ సీజన్‌లో 9,244.206 మెట్రిక్ టన్నుల ధాన్యం సీఎమ్మార్ కోసం తీసుకొని, 4,452.546 మెట్రిక్ టన్నులు బకాయి పడగా, దాదాపు రూ. 15.14 కోట్లకుపైగా ప్రభుతానికి నష్టం వాటిల్లజేశాడన్న అభియోగాలు ఉన్నాయి. వాటితోపా టు గతంలో మరో రెండు కేసులు నమోదై ఉన్నందున పీడీ యాక్టు అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మోయలేని భారమే కారణమా...?
పౌరసరఫరాల శాఖ అధికారులు తమపై మో యలేని బరువు ఎత్తినందునే డిఫాల్టర్లుగా మారామని పలువురు రైస్ మిల్లుల యజమానులు వాపోతున్నారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి ధాన్యం కేటా యించడంలో పౌర సరఫరాలశాఖ అధికారులు అత్యు త్సాహం ప్రదర్శించారనే అపవాదు ఉంది. ఆ సీజన్‌లో 15 రోజుల్లో సీఎమ్మార్ పూర్తికావస్తున్న సమయంలో అధనంగా మరో 50వేల బస్తాల వరకు బలవంతంగా అంటగట్టినట్లు ఆవేధన చెందుతున్నారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యా న్ని త్వరితగతిన తరలించడంతోపాటు రైతుల ఖాతాల్లో నగదు చేయాల్సి ఉన్నందున మిల్లర్లపై ఒత్తిడి తెచ్చి నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అదనంగా అంటగట్టిన ధాన్యానికి మరో మూడు నెలలు అదనపు గడువు ఇప్పిస్తానని చెప్పిన ఓ ఉన్నతాధికారి తరువాత ముఖం చాటేసినట్లు మిల్లర్లు లబోదిబోమంటున్నారు. 15 రోజుల అతి స్వల్ప వ్యవధిలో అదనపు ధాన్యానికి సీఎమ్మార్ ఇవ్వలేక తామంతా డిఫాల్టర్లుగా మారినట్లు వాపోతున్నారు. అధికారుల తప్పిదం కారణంగా 25 శాతం పెనాల్టికి గురికావలసి వచ్చిందని, ఈ విషయ మై కలెక్టర్‌కు తమ గోడు వెళ్లబోసుకాగా, రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్‌కు లేఖ సైతం రాసినట్లు చెబుతు న్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు పెనాల్టీ రద్దు చే యకపోగా, పీడీ యాక్టు అమలు చేస్తుండటంతో వా రంతా ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు క్వింటా ధాన్యం మరాడిస్తే కేవలం 57-58 కిలోల బియ్యం మా త్రమే వస్తాయని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 67 కిలో లు ఇవ్వడం సాధ్యం కావడం లేదని వాపోతున్నారు. ఈ క్రమంలో ఒక్కో మిల్లుకు ఏడాదికి రూ. 40 లక్షల వరకు నష్టం వాటిల్లుతుండటంతో అప్పుల భారం అధి కమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ధాన్యం మరాడించినందుకు గత ప్ర భుత్వ హయాంలో మిల్లింగ్ చార్జీలు, ట్రాన్స్‌పోర్టు ఖ ర్చులు ఇవ్వలేదని, ఈ క్రమంలో ఆ భారం కూడా త మపైనే పడిందని చెబుతున్నారు. ఈ విషయమై ప్ర స్తుత ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు కలగ చేసుకోవడం ద్వారా అకారణంగా డిఫాల్లర్లుగా మారిన మిల్లర్లను రక్షించాలనే విజ్ఞప్తులు ఉన్నాయి.