kumaram bheem asifabad- గంజాయిపై ఉక్కుపాదం
ABN , Publish Date - Sep 08 , 2026 | 10:50 PM
యువత మాదక ద్రవ్యాల బారిన పడుకుండా కాపాడడం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాల మేర కు జిల్లా పోలీసులు మత్తు పదార్ధాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా గత జూన్ నెలలో జిల్లా డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ ఆధ్వర్యంలో పట్టుబడ్డ గంజాయి ఇన్సిపిరేషన్ ప్రక్రియ ద్వారా 296.31 కిలోల గంజాయి దహనం చేశారు. గంజాయి సాగుపై ప్రత్యేక నిఘా పెట్టి రెండు సంవత్సరాల్లో 414 కిలోల గంజా యి, 2003 గంజాయి మొక్కలను దహనం చేసినట్లు ప్రకటించారు.
- పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్న మొక్కలు
కాగజ్‌నగర్ టౌన్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): యువత మాదక ద్రవ్యాల బారిన పడుకుండా కాపాడడం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాల మేర కు జిల్లా పోలీసులు మత్తు పదార్ధాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా గత జూన్ నెలలో జిల్లా డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ ఆధ్వర్యంలో పట్టుబడ్డ గంజాయి ఇన్సిపిరేషన్ ప్రక్రియ ద్వారా 296.31 కిలోల గంజాయి దహనం చేశారు. గంజాయి సాగుపై ప్రత్యేక నిఘా పెట్టి రెండు సంవత్సరాల్లో 414 కిలోల గంజా యి, 2003 గంజాయి మొక్కలను దహనం చేసినట్లు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి సరఫరా, గంజాయి మొక్కల పెంపకంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా రు. గంజాయి పొడి అమ్మకాలపై అంతర్రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న విషయాలపై ప్రత్యేక నిఘా పెట్టి కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని బల్హార్ష సమీపంలో నుంచి పొడి గంజాయి ప్యాకెట్లు సరఫరా చేస్తుండగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. రెబ్బెన, వాంకిడితో పాటు, తిర్యాణి పోలీసులు నిఘాతో గంజాయి పట్టుపడింది.
- తనిఖీలు చేపడుతున్నా..
జిల్లాలో గంజాయి సాగును అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్న ఇతర ప్రాంతాలనుంచి దిగుమతికి అడ్డుకట్ట పడటం లేదు. చదువుకునే వయస్సులోనే యువత గ్యాంగ్‌లుగా మారి గంజాయి వ్యసనానికి బానిసవుతున్నారు. గంజాయి వినియోగం, మాదకద్రవ్యాలు, మత్తు పదార్ధాల వల్ల కలిగే అనార్థాలపై పోలీసులు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, హాస్టళ్లు, కళాశాలలతో పాటు ఆయా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. గత జూన్ నెలలో కూడా పెద్ద ఎత్తున పట్టుబడి గంజాయిని ధ్వంసం చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున దాడులు చేస్తూ గంజాయి నిర్మూలనకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఎలాంటి గంజాయిని పట్టుకున్న ధాఖలాలు కానీ కేసులు కానీ బహిర్గంతం కాలేదు. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆధేశాలతో ఇటీవల పలు పోలీసు స్టేషన్ల పరిధిలో గంజాయి పట్టుకొని కేసు నమోదు చేశారు. సిర్పూర్ (యు) పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి సాగుపై పోలీసులు దాడి చేసి 460 గంజాయి మొక్కలు, నిందితులను పట్టుకు న్నారు. జిల్లా వ్యాప్తంగా విఽవిధ పోలీసుస్టేషన్ల పరిధిలో 57 కేసుల్లో ఎండు గంజాయి, 964 గంజాయి మొక్కలను పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా దహనం చేశారు. వీటి విలువ 1.70 కోట్లు ఉంటుంది.
- గత ఏడాది 53 కేసులో..
గత ఏడాది 53 కేసుల్లో 117 కిలోలు, 1,039 మొక్కలు దహనం చేసినట్లు ప్రకటించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో విస్త్రృత అవగాహన కల్పించడం కోసం, డ్రగ్ వినియోగం, అక్రమ గంజాయి రవాణాను అరికట్టేందుకు సమాజాన్ని చైతన్య పరిచి యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇందులో భాగంగా వరుస కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేస్తున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సాగు చేస్తున్న గంజాయి సాగుతో పాటు సరిహద్దునే ఉన్న మహారాష్ట్ర నుంచి రవాణా అవుతున్న గంజాయిపై ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో పాటు యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్ధాల పట్ల పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరుతున్నారు. మాదక ద్రవ్యాలు, ఇతర మత్తు పదార్ధాల విషయాలను 1908, 112కు సమాచారం అందించాలని సూచిస్తు న్నారు. సిర్పూర్ (యు), జైనూరు, కెరమెరి, వాంకిడి, బెజ్జూరు, చింతలమానెపల్లి, తిర్యాని, రెబ్బెన, తదితర మండలాల్లో పోలీసుస్టేషన్ల వారీగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
యువత వ్యసనాల బారిన పడొద్దు..
- ఎస్పీ నితికాపంత్
యువత వ్యసనాల బారిన పడొద్దు. విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రజలు అప్రమత్తంగా ఉండి సమాచారం పోలీసులకు అందించాలి. అక్రమార్జన కోసం కొందరు గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడుతున్నారు. మత్తు పదార్థాల నిర్మూళనకు పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం గంజాయి రవాణా, విక్రయాలపై తనిఖీలు చేపడుతున్నాం.