మరి సీపీఎస్ ఉద్యోగుల సంగతేంటి..?
ABN , Publish Date - Apr 30 , 2026 | 05:36 AM
రాష్ట్ర ప్రభుత్వం పదవీ విరమణ చేసిన పాత పింఛను విధానం (ఓపీఎస్) ఉద్యోగులకు రూ. వెయ్యి కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల చేసి ...
రూ.1000 కోట్లలో మా వాటా ఎంతో చెప్పండి
సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ
హైదరాబాద్, ఏప్రిల్ 29 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పదవీ విరమణ చేసిన పాత పింఛను విధానం (ఓపీఎస్) ఉద్యోగులకు రూ. వెయ్యి కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల చేసి కాంట్రిబ్యూటరీ పింఛను విధానం (సీపీఎస్) ఉద్యోగుల పట్ల వివక్ష చూపిందని సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ఆరోపించారు. ఓపీఎస్ ఉద్యోగులకు తీపి కబురు అందించిన ప్రభుత్వం, సీపీఎస్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. సీపీఎస్ ఉద్యోగులకు బకాయిలు తమ ప్రాన్ ఖాతాలో జమ కాకపోవడంతో వారి ప్రాన్ ఖాతా సెటిల్‌మెంట్లు నిలిచిపోయాయని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాన్ ఖాతా ఫైనల్ పేమెంట్ కాకపోవడంతో సీపీఎస్ పింఛను రావడం లేదన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ. వెయ్యి కోట్లలో సీపీఎస్ ఉద్యోగుల వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు.