పాత పింఛను ప్రస్తావన లేకపోవడం విచారకరం
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:12 AM
బడ్జెట్‌లో పాత పెన్షన్ విధానం అమలు ప్రస్తావన లేకపోవడంపై సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ విచారం వ్యక్తం చేశారు.
సీపీఎస్ ఉద్యోగుల సంఘం
హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్ర జ్యోతి): బడ్జెట్‌లో పాత పెన్షన్ విధానం అమలు ప్రస్తావన లేకపోవడంపై సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ విచారం వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో ఉద్యోగులకు భరోసా కల్పించే పెన్షన్ అనేది ఎవరో పెట్టే బిక్ష కాదని, అది తమ హక్కని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరుగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాల వల్ల మార్కెట్లు కుదేలై, సీపీఎస్ ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లోని నిధులు ఆవిరవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎస్ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని, పెండింగ్ సమస్యలన్ని పరిష్కరించాలని శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. తక్షణమే పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో సీపీఎస్ ఉద్యోగులంతా ఏకమై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్థితప్రజ్ఞ హెచ్చరించారు.