Share News

సీపీఎస్‌, ఎన్‌ఈపీ వెంటనే రద్దు చేయాలి

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:03 PM

ఉపాధ్యాయ, ఉద్యోగు ల పాలిట శాపంగా మారిన సీపీఎస్‌ తో పాటు విద్యారంగాన్ని ప్రైవేటు, కా ర్పొరేట్‌ పరం చేసేలా ఉన్న నూతన జాతీయ విద్యా విధానాన్ని తక్షణమే ర ద్దు చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీధర్‌శర్మ డిమాం డ్‌ చేశారు.

సీపీఎస్‌, ఎన్‌ఈపీ వెంటనే రద్దు చేయాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న టీఎస్‌యూటీఎఫ్‌ నాయకులు

- టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌శర్మ

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయ, ఉద్యోగు ల పాలిట శాపంగా మారిన సీపీఎస్‌ తో పాటు విద్యారంగాన్ని ప్రైవేటు, కా ర్పొరేట్‌ పరం చేసేలా ఉన్న నూతన జాతీయ విద్యా విధానాన్ని తక్షణమే ర ద్దు చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీధర్‌శర్మ డిమాం డ్‌ చేశారు. గురువారం టీఎస్‌యూటీ ఎఫ్‌ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి పలు డిమాండ్లతో కూడిన వినతిప త్రాన్ని డీఆర్‌ఓకు అందజేశారు. శ్రీధర్‌శర్మ మా ట్లాడుతూ 2004 సెప్టెంబరు 1 నుంచి అమలు లోకి వచ్చినసీపీఎస్‌ విధానం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, స ర్వీసు లో ఉన్న టీచర్లను టెట్‌ నుంచి మినహాయిం పు ఇస్తూ విద్యాహక్కు చట్టాన్ని సవరిస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.కృష్ణ, నాయకులు సి.తిరుపత య్య, కొర్ర శంకర్‌, లలితాబాయి, కురుమయ్య, చంద్రశేఖర్‌, లక్ష్మణ్‌, వహీద్‌ఖాన్‌, వెంకటయ్య, బాలరాజు, ప్రభాకర్‌, సునీల్‌కుమార్‌, శేషగిరి, కోటేశ్వర్‌, మల్లయ్య, గౌస్‌పాషా, ఆంజనేయులు, సువర్ణ, సురేఖ, కృష్ణ, ఖాజ, సలీం పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 11:03 PM