16,17 తేదీల్లో సీపీఎం యువజన సమ్మేళనం
ABN , Publish Date - Jun 09 , 2026 | 05:19 AM
ఈ నెల 16, 17 తేదీల్లో యువజన సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ...
హైదరాబాద్, జూన్ 8(ఆంధ్ర జ్యోతి): ఈ నెల 16, 17 తేదీల్లో యువజన సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువత భవిష్యత్తుపై దృష్టిపెట్టడం లేదని, యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 60 లక్షల ఖాళీలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 17 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేసిందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు క్లియర్ చేసి.. తమ ఖాతాలో వేసుకుంటున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో యువత సమస్యలపై చర్చించేందుకు కొత్తపేట బీజేఆర్ భవన్‌లో యువజన సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు.