Share News

ఆలయ కౌలు భూములను తీసుకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తాం: జాన్‌ వెస్లీ

ABN , Publish Date - Jan 28 , 2026 | 03:30 AM

ఏళ్లుగా దేవాలయ భూములను కౌలుకు సాగు చేసుకొని బతుకుతున్న రైతులను ఆదుకోవాలి. ఆ భూములను రైతుల పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేసి పాస్‌ బుక్‌లు అందించాలి.

ఆలయ కౌలు భూములను తీసుకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తాం: జాన్‌ వెస్లీ

యాచారం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ‘ఏళ్లుగా దేవాలయ భూములను కౌలుకు సాగు చేసుకొని బతుకుతున్న రైతులను ఆదుకోవాలి. ఆ భూములను రైతుల పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేసి పాస్‌ బుక్‌లు అందించాలి. ఫ్యూచర్‌సిటీ కోసం ఆ భూములను తీసుకుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా నందివనపర్తిలోని ఓంకారేశ్వర ఆల య భూములను కౌలుకు చేసుకుంటున్న నందివనపర్తి, తాటిపర్తి, కుర్మిద్ద,నజ్దిక్‌సింగారం రైతులతో కుర్మిద్దలో జరిగిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. భూముల పరిరక్షణకు ఈనెల 30న యాచారం తహసీల్దారు కార్యాలయం ముట్టడించనున్నట్లు జాన్‌వెస్లీ వెల్లడించారు.

Updated Date - Jan 28 , 2026 | 03:30 AM