Share News

పవన్‌ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

ABN , Publish Date - Jun 04 , 2026 | 06:07 AM

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రాంతీయ విద్వేషాలను..............

పవన్‌ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

  • ఉపసంహరించుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు: జాన్‌ వెస్లీ

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్ర జ్యోతి): ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా, పీడిత ప్రజల వర్గ పోరాటాలను అవమానించేలా మాట్లాడటం.. బాధ్యతాయుత పదవిలో ఉండి తగదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీపీఎం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిందంటూ అవాస్తవాలతో బురద జల్లడం ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేనని విమర్శించారు. కమ్యూనిజం సచ్చిపోయిందని చెప్పడం పవన్‌ అజ్ఞానాన్ని, అవివేకాన్ని తెలియజేస్తోందన్నారు. పవన్‌ పూర్తిగా బీజేపీ, ప్రధాని మోదీ అజెండాకు అనుగుణంగా మతోన్మాద, విద్వేష రాజకీయాలను తెలంగాణలో చొప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పవన్‌ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం ఎన్నటికీ ఆమోదించదని.. ఆ వ్యాఖ్యలను ఉపసంహరిచుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Updated Date - Jun 04 , 2026 | 06:07 AM